ప్రపంచ బాడ్మింటన్ చరిత్రలో పివి సింధు ఘనత

     Written by : smtv Desk | Sat, Feb 09, 2019, 11:56 AM

ప్రపంచ బాడ్మింటన్ చరిత్రలో పివి సింధు ఘనత

స్పోర్ట్స్ డెస్క్ , ఫిబ్రవరి 09: భారతదేశపు బాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు పెద్ద రికార్డు నమోదు చేసింది. కానీ ఇది ఆటకి సంభందించిన రికార్డు కాదు, చైనాతో జరిగిన స్పాన్సర్‌షిప్‌ ఒప్పందంతో ఆమె ఈ రికార్డు సాధించింది.

తాజాగా చైనాకు చెందిన క్రీడా ఉపకరణాల సంస్థ 'లి నింగ్‌' సింధు తో నాలుగు సంవత్సరాలకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఆమెకు లి నింగ్‌ సంస్థ రూ. 50 కోట్లు చెల్లిస్తుంది.ఇందులో రూ.40 కోట్లు స్పాన్సర్‌షిప్‌ మొత్తంగా... మరో రూ.10 కోట్లు బ్యాడ్మింటన్‌ క్రీడా సామగ్రి రూపంలో ఆమెకు అందజేస్తుందని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో సింధు ఇకపై లి నింగ్‌కు చెందిన క్రీడా ఉత్పత్తులనే వాడాల్సి ఉంటుంది. ఇటీవల ఈ కంపెనీ కిదాంబి శ్రీకాంత్‌తో రూ. 35 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. గతంలో 2014–15లో రెండేళ్ల పాటు సింధుకు స్పాన్సర్‌షిప్‌ అందించి ఏడాదికి కోటిన్నర చెల్లించింది.

ఆ తర్వాత యోనెక్స్‌ కంపెనీతో సింధు అనుబంధం కొనసాగించింది. వారు ఏడాదికి రూ. 3.5 కోట్లు చెల్లించింది. ఇప్పుడు లి నింగ్ సంస్థతో సింధు చేసుకున్న ఒప్పందం ప్రపంచ బాడ్మింటన్ లోనే అతి పెద్ద డీల్ అని లి నింగ్‌ ప్రతినిధి మహేంద్ర కపూర్‌ వెల్లడించారు.





Untitled Document
Advertisements