అత్యవసర సమావేశానికి హాజరుకానున్న ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 09:58 AM

అత్యవసర సమావేశానికి హాజరుకానున్న ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తన అనారోగ్య నిమిత్తం అమెరికాకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన ఆరోగ్యం కుదుట పడడంతో తిరిగి వచ్చారు. జైట్లీ అమెరికాకు వెళ్లిన తరువాత మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టే బాధ్యతలను పీయుష్ గోయల్ కు అప్పగించిన విషయం తెలిసిందే.

కాగా పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అత్యవసర క్యాబినెట్ మీటింగ్ జరుగనుండగా, ఈ సమావేశానికి ఆర్థికమంత్రి హోదాలో అరుణ్ జైట్లీ హాజరుకానున్నారు. జైట్లీ భారత్ కు వచ్చిన వెంటనే తన ఆర్థిక శాఖ బాధ్యతలను తిరిగి స్వీకరించారు. నిన్న జరిగిన ఉగ్రదాడిపై ఆయన స్పందిస్తూ, "ఉగ్రవాదులకు మరచిపోలేని గుణపాఠం చెబుతాం. వారి చర్యలు అత్యంత క్రూరం" అని వ్యాఖ్యానించారు.





Untitled Document
Advertisements