కఠిన నిర్ణయం తీసుకోవాలని పాక్‌ రాయబారిని భారత్‌ ఆదేశించింది

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 07:28 PM

 కఠిన నిర్ణయం తీసుకోవాలని పాక్‌ రాయబారిని భారత్‌ ఆదేశించింది

పాకిస్తాన్, ఫిబ్రవరి 15: భారత విదేశాంగ శాఖ ఈ రోజు పాకిస్తాన్ హై కమీషనర్ సోహెల్ మహమూద్‌కు సమన్లు జారీ చేసింది. ఈ విషయాన్ని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే వెల్లడించారు. పుల్వామాలో జవాన్లపై జరిగిన ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ పాక్‌ రాయబారికి సమన్లు జారీ చేసింది.

పాక్‌ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌పై పాక్‌ వెంటనే కఠిన నిర్ణయం తీసుకోవాలని పాక్‌ రాయబారిని భారత్‌ ఆదేశించింది. పాక్‌ నేలపై నుంచి సాగుతున్న అన్ని రకాల ఉగ్ర కార్యకలాపాలను అడ్డుకునే చర్యలు చేపట్టాలని కోరింది. పుల్వామా దాడిపై గురువారం పాక్‌ విదేశాంగ శాఖ చేసిన ప్రకటనను భారత విదేశాంగ కార్యదర్శి ఖండించారు.





Untitled Document
Advertisements