కాంగ్రెస్ ను వీడిన కెసిఆర్ అన్న కూతురు

     Written by : smtv Desk | Sat, Mar 16, 2019, 07:16 PM

కాంగ్రెస్ ను వీడిన కెసిఆర్ అన్న కూతురు

హైదరాబాద్, మార్చ్ 16: కాంగ్రెస్ నుండి తెరాస లోకి వలసల జోరు రోజురోజుకి అధికమవుతుంది. తాజాగా ముఖ్యమంత్రి కెసిఆర్ అన్న కూతురు కల్వకుంట్ల రమ్యారావు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె త్వరలోనే కారెక్కనున్నారని సమాచారం. రమ్యారావు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కెసిఆర్ తో పాటు ఆయన ఫ్యామిలీని తీవ్రంగా విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి తరఫున కూకట్ పల్లి టిడిపి అభ్యర్థి నందమూరి సుహాసిని కోసం ప్రచారం కూడా చేశారు రమ్యారావు.





Untitled Document
Advertisements