యాదాద్రి గల్లా పెట్టాలో ఏడాది ఆదాయం @100 కోట్లు

     Written by : smtv Desk | Sat, Apr 13, 2019, 11:37 AM

యాదాద్రి గల్లా పెట్టాలో ఏడాది ఆదాయం @100 కోట్లు

యాదాద్రి: తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలోని గల్లా పెట్టాలో ఊహంచని విధంగా ఏడాదిలో వంద కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రం ఏర్పడ్డాక ఐదేండ్లలోనే రూ.40 కోట్ల మేర పెరిగింది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కొండపై నిర్మాణాలు జరుగుతుండటంతో బాలాలయంలోనే దర్శనాలు కొనసాగుతున్నా భక్తులు పొటెత్తుతూనే ఉన్నారు. ఈ ఏడాది భక్తుల నుంచి వివిధ కైంకర్యాల ద్వారా సమకూరిన ఆదాయం గతేడాది కంటే 5 కోట్ల 60 లక్షల 56 వేల 513 ఆదాయం అధికంగా వచ్చింది. యాదాద్రి పుణ్యక్షేత్రం 2013-14లో 66 కోట్ల 58 లక్షల 47 వేల 445 ఉన్న ఆదాయం.. 2018-19లో 99 కోట్ల 57 లక్షల 48 వేల 282కు చేరుకున్నది. గతేడాది 93 కోట్ల 96 లక్షల 91 వేల 769 ఆదాయం రాగా ఈ ఏడాది 5 కోట్ల 60 లక్షల 6 వేల 513 అదనంగా సమకూరింది. 2013-14లో 66 కోట్ల 58 లక్షల 7 వేల 445 ఆదాయం వస్తే 66 కోట్ల 47 లక్షల 47 వేల 730 ఖర్చు చేశారు. అంటే 10 వేల 997 మాత్రమే మిగులు ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడి ఆదాయాన్ని ఎక్కువగా ఆంధ్రాప్రాంతానికి తరలించడం వల్లనే వ్యయం అధికంగా ఉండేది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఈ నిధుల తరలింపునకు బ్రేక్ పడింది. వ్యయంలోనూ పారదర్శకత పెరిగింది. దీంతో 2018-19లో మిగులు రూ.5 కోట్లకు చేరుకున్నది.





Untitled Document
Advertisements