‘లాండ్రీకార్ట్’ బిజినెస్ స్టార్ట్ చేసిన సుకుమార్ భార్య

     Written by : smtv Desk | Sun, Apr 14, 2019, 07:31 PM

‘లాండ్రీకార్ట్’ బిజినెస్ స్టార్ట్ చేసిన సుకుమార్ భార్య

హైదరాబాద్: టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబితా సుకుమార్ లాండ్రీ బిజినెస్‌ ను ప్రారంభించారు. తబితా సుకుమార్, అలేఖ్య, గిరిజ, శరత్ భాగస్వాములుగా ‘లాండ్రీకార్ట్’ అనే పేరుతో ప్రారంభించిన సంస్థ నుండి మొబైల్ యాప్ సర్వీస్‌ను ఆదివారం హైదరాబాద్‌లో నటి సమంత ప్రారంభించారు. ఆధునిక యుగంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం తప్పనిసరిగా మారిన తరుణంలో లాండ్రీకార్ట్ వారికో వరంలా ఉపయోగపడుతుందని సమంత అన్నారు. లాండ్రీకార్ట్ సర్వీసుల గురించి తబితా సుకుమార్ మాట్లాడుతూ.. ఏడాదిన్నర పాటు గ్రౌండ్‌వర్క్ చేసిన తర్వాత గత ఏడాది జూన్‌లో లాండ్రీకార్ట్‌ను ప్రారంభించామని తెలిపారు. ఈ సంస్థకు సినిమాలకు సంబంధం లేదని తెలిపారు. మధ్యతరగతి వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని తక్కువ ఖర్చుతో సర్వీసులను అందించాలని ప్రారంభించామన్నారు. వ్యాపారం చేయాలనే ఆలోచనతో కాకుండా సేవ చేస్తూనే చాలా మందికి ఉపాధి కల్పించాలనే లాండ్రీకార్ట్‌ను ప్రారంభించామని తెలిపారు. లాండ్రీకార్ట్‌లో ప్రీమియం లాండ్రీ, డ్రైక్లీనింగ్ పేరుతో రెండు రకాల సర్వీసులను అందిస్తున్నామన్నారు. ఇతర వ్యాపార సంస్థలకు భిన్నంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించినట్లు తబిత చెప్పారు. ‘మార్కెట్‌లో ప్రస్తుతమున్న లాండ్రీ సర్వీసులలో దుస్తులను ఇస్తే తిరిగి వారం రోజుల తరువాత ఇస్తున్నారని.. కానీ లాండ్రికార్ట్ అంత సమయం తీసుకోకుండా కేవలం 48 గంటల్లోనే వినియోగదారులుకు దుస్తులను అందజేస్తుందన్నారు. ప్రస్తుతం పది శాఖలు విజయవంతంగా నడుస్తున్నాయని.. ఎక్కడైనా డెలివరీ చేసే సౌకర్యం ఉందని వెల్లడించారు.

Untitled Document
Advertisements