డ్యూటిలో ఉన్న కానిస్టేబుల్ పై దాడి

     Written by : smtv Desk | Tue, Apr 16, 2019, 02:57 PM

డ్యూటిలో ఉన్న కానిస్టేబుల్ పై దాడి

ముంబై: ముంభైలో ఓ యువకుడు డ్యూటిలో ఉన్న కానిస్టేబుల్ ను చితక్కొట్టి పారిపోయాడు. ఈ సంఘటన పూర్తి వివరాల ప్రకారం....ముంబయి లోని ఎంకే రోడ్డు వద్ద కానిస్టేబుల్ దీపక్ దేవ్రే విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా అర్మాన్ అన్‌కోల్కర్ అనే యువకుడు తన బీఎండబ్ల్యూ కారులో వెళ్తున్నారు. అయితే కానిస్టేబుల్ కారును ఆపి డ్రైవరును డాక్యుమెంట్లు చూపించాలని కోరారు. దీంతో కానిస్టేబుల్ దేవ్రే, కారు యజమాని అర్మాన్ అన్‌కోల్కర్ ల మధ్య వాగ్వాదం జరిగింది. అంతలో అర్మాన్ అన్‌కోల్కర్ కారు దిగి కానిస్టేబుల్ చేతిలో ఉన్న లాఠీని లాక్కోని దాంతోనే అతన్ని కొట్టి పారిపోయాడు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.





Untitled Document
Advertisements