అమెజాన్ లో ఫ్లైట్ టికెట్స్

     Written by : smtv Desk | Sun, May 19, 2019, 11:37 AM

అమెజాన్ లో ఫ్లైట్ టికెట్స్

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తాజాగా విమాన టికెట్ బుకింగ్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ప్రైమ్, నాన్ ప్రైమ్ కస్టమర్లకు క్యాష్ బ్యాక్‌ను ప్రకటించింది. ఈ విమాన సేవల కోసం ఆన్‌లైన్ ట్రావెల్ సంస్థ క్లియర్‌ట్రిప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న అమెజాన్ పేమెంట్ సంస్థ ‘అమెజాన్ పే’ ద్వారా ఈ సేవలను ఆఫర్ చేస్తోంది. అయితే అమెజాన్ హోం పేజీలో ఇప్పటివరకు ఈ కొత్త సేవల గురించి వెల్లడించలేదు. అమెజాన్ వెబ్‌సైట్ ప్రకారం, ఎలాంటి ఎక్స్‌ట్రా క్యాన్సిలేషన్ పెనాల్టీ ఉండదు, అత్యధిక క్యాష్‌బ్యాక్ ఆఫర్, హిడ్డెన్ చార్జీలు ఉండవు, సులువుగా బుకింగ్ చేసుకోవచ్చు.





Untitled Document
Advertisements