52 కేకులతో శివసేన ముఖ్య నేత పుట్టినరోజు వేడుకలు

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 07:49 PM

52 కేకులతో శివసేన ముఖ్య నేత పుట్టినరోజు వేడుకలు

శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ప్రధాన అనుచరుడు, వ్యక్తిగత కార్యదర్శి మిలింద్ నర్వేకర్.. తన పుట్టినరోజును వినూత్నంగా జరుపుకున్నారు. 52వ పుట్టిన రోజు నాడు .. 52 కేకులను కట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. యువ సేన కార్యనిర్వాహకుడు, రెస్టారెంట్ ఓనర్ రాహుల్ కనాల్ ... ఈ కేకులను నిర్వాకర్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించారు.

ఒక్కో కేకు ఒక్కో ఫ్లేవర్‌తో.. ఒక్కో సైజులో ఉండటం విశేషం. బాంద్రాలోని ఆయన నివాసంలో శనివారం జరిగిన ఈ పుట్టిన రోజు వేడుకల్లో.. కేకులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు పాల్గొన్నారు. నిర్వాకర్ పుట్టిన రోజు సందర్భంగా.. శివసేన అధికారిక పత్రిక సామ్నా మెయిన్ పేజీలో అతిపెద్ద ప్రకటన ఇచ్చారు. శివసేన నాయకులతో పాటు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఫొటో కూడా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Untitled Document
Advertisements