తజికస్తాన్‌ జైలులో ఘర్షణ...ముగ్గురు పోలీసులతో పాటు 29 మంది ఖైదీలు మృతి

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 05:55 PM

తజికస్తాన్‌ జైలులో ఘర్షణ...ముగ్గురు పోలీసులతో పాటు 29 మంది ఖైదీలు మృతి

తజికస్తాన్‌: తజికస్తాన్‌ జైలులో అల్లర్లు చేలరేగాయి. ఈ నేపథ్యంలో జైలులోకి చొచ్చుకొచ్చిన ఐసిస్‌ మిలిటెంట్లు పోలీసుల మధ్యకాల్పులు జరపడంతో ముగ్గురు పోలీసులతో పాటు 29 మంది ఖైదీలు మృతి చెందారు. అంతేకాక తజికిస్తాన్‌ రాజధాని దుషాంబేకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వక్దత్‌ నగరంలోని జైలులోకి ఐసిన్‌ ఉగ్రవాదులు చొరబడి జైలుకు కాపలాగా ఉన్న ముగ్గురు పోలీసులను ఐదు మంది ఖైదీలను కత్తితో నరికి హత్యచేశారని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. అనంతరం జైలు ఆవరణలోనే ఉన్న కహాస్పటల్‌లోకి వెళ్లి శిక్ష పొందుతున్న పలువురు ఐసిస్‌ ఉగ్రవాదులను తీసుకుని తప్పించుకేనే ప్రయత్నించారు. ఈ క్రమంలోనే భద్రతాదళాలు అలర్ట్‌ అయి 24 మంది మిలిటెంట్లపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 24 మంది మృతి చెందారు. వారు తప్పించుకునేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది వారిపై కాల్పులు జరిపి మట్టబెట్టిందని ఆ దేశ న్యాయశాఖ మంత్రి తెలిపారు. ఆ జైలులో1500 మంది ఖైదీలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇక పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన వారిలో ఇస్లామిక్‌ రినైస పార్టీ ఆఫ్‌ తజికిస్తాన్‌కు చెందిన ఇద్దరు సీనియర్‌ సభ్యులు ఉన్నారు. ఇది తజికిస్తాన్‌లో నిషేధంలో ఉన్న ఇస్లామిక్‌ పార్టీ. కాల్పుల్లో మృతి చెందిన వారిలో మరోక మతగురువు ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. ఆ మతగురువు తజికిస్తాన్‌ ప్రభుత్వాన్ని కూలదోయాలనే కుట్ర చేశారని అందుకు ఆయన్ను అరెస్టు చేసి జైలుకు పంపినట్లు తజికిస్తాన్‌ ప్రభుత్వం తెలిపింది. ఇక జైలులోకి వచ్చిన ఐసిస్‌ ఉగ్రవాదుల్లొ ఒకరు బెక్రూజ్‌ గుల్కొరాద్‌గా గుర్తించారు. ఈయన గుల్కొరాద్‌ ఖలీమోవ్‌ అనే తజికిస్తాన్‌ స్ఫెషల్‌ పోర్సెస్‌ కల్నల్‌ కొడుకు. 2015లో ఐసిస్‌ పట్ల ఆకర్షితుడై ఖలిమోవ్‌ అందులో చేరినట్లు తజికిస్తాన్‌ ప్రభుత్వం తెలిపింది. అయితే భద్రతా బలగాల కాల్లుపుల్లో ఆయన సరియాలో మృతి చెందాడు. ఇదిలా ఉంటే తజికిస్తాన్‌లోకి కొన్ని వేల మంది ఐసిస్‌కు ఆకర్షి´తులై అందులో చేరినట్లు సమాచారం. అయితే ఐసిస్‌లో పెద్దతలకాయలు లేవు, అయినప్పటికీ అడపాదడపా దాడులు చేస్తూనే ఉంది. గతేడాది నవంబర్‌లో మరోజైలులో జరిగిన ఘర్షణలకు కూడా బాధ్యత తమదే అని ఐసిస్‌ ప్రకటించింది.





Untitled Document
Advertisements