ఇకపై రాజకీయ కార్టూన్లను ప్రచురించం: న్యూయార్క్‌టైమ్స్‌

     Written by : smtv Desk | Wed, Jun 12, 2019, 01:27 PM

ఇకపై రాజకీయ కార్టూన్లను ప్రచురించం: న్యూయార్క్‌టైమ్స్‌

న్యూయార్క్‌: ప్రముఖ విదేశీ పత్రికా సంస్థ న్యూయార్క్‌టైమ్స్‌ ఇకనుంచి రాజకీయ కార్టూన్లను ప్రచురించబోమని ప్రకటించింది. గత ఏప్రిల్‌లో ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుపై ప్రచురించిన వ్యంగ్యచిత్రం వివాదాస్పదం కావటంతో దానిపై క్షమాపణలు చెప్పిన టైమ్స్‌ యాజమాన్యం ఈ మేరకు తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ట్రంప్‌ గొలుసు కట్టి లాక్కెళ్తున్న (యూదులు ధరించే టోపీని ధరించిన) కుక్క పిల్ల రూపంలో నెతన్యాహును ఈ పత్రిక చిత్రీకరించింది. దీనిపై యూదు ల్లో పెద్దయెత్తున నిరసన చెలరేగింగి. ఐరాసలో ఇజ్రాయిల్‌ రాయబారి దీనిని ఐరాస దృష్టికి తీసు కెళ్తూ నాజీ ప్రచార పత్రిక డెర్‌ స్టర్మర్‌ తీరులో వుందని విమర్శించారు.





Untitled Document
Advertisements