బోరిస్‌కు భారతీయ ఎంఎల్‌ఏలు మద్దతు

     Written by : smtv Desk | Thu, Jun 13, 2019, 01:30 PM

బోరిస్‌కు భారతీయ ఎంఎల్‌ఏలు మద్దతు

లండన్: లండన్ ప్రధాని థెరెసా మే జూన్ 7 న తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ స్థానంలో కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు బ్రిటన్‌లో సన్నా హాలు జరుగుతున్నాయి. ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్, డోమినిక్ రాబ్ పోటీపడుతున్నారు. బోరిస్‌కు భారతీయ సంతతికి చెందిన ఐదుగురు కన్జర్వేటివ్ పార్టీ ఎంఎల్‌ఏలు తమ మద్దతు ప్రకటించారు. అలాగే, డోమినిక్ రాబ్‌కు ఇద్దరు అనుకూలంగా ఉన్నారు. ఇలా ఉండగా సోమవారంతో నామినేషన్ల గడువుముగియడం తో ప్రధాని పదవి రేసులో ఉన్న ఇద్దరూ హామీ ల్ని గుప్పిస్తున్నారు. బ్రిటన్ కు మరింత ప్రయోజనం చేకూరేలా యూరోపియన్ యూనియన్ లో విడాకుల బిల్లును నిలిపి ఉంచుతామన్నా రు. అలాగే పన్నుల్లో కోత విధిస్తామని ఆయన, ఇతర అభ్యర్థులు చెబుతున్న విషయం చర్చనీయాంశమైంది. రెండు విడతల్లో జరిగే ఎన్నికల్లో 318 ఎంపీలు తొలి విడతలో ఓటేస్తారు.





Untitled Document
Advertisements