అండర్ వాటర్ థీమ్ పార్క్ కోసం బోయింగ్ 747 విమానాన్ని ముంచారు!

     Written by : smtv Desk | Fri, Jun 14, 2019, 02:12 PM

అండర్ వాటర్ థీమ్ పార్క్ కోసం బోయింగ్ 747 విమానాన్ని ముంచారు!

బెహ్రెయిన్ దేశంలోని సముద్రంలో కొత్తగా నిర్మిస్తున్న అండర్ వాటర్ థీమ్ పార్క్ కోసం అక్కడి ప్రభుత్వం బోయింగ్ 747 విమానాన్ని ముంచేశారు. లక్ష చదరపు మీటర్ల విస్తీర్ణం గల వాటర్ థీమ్ పార్కులో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. అందులో ఈ బోయింగ్ 747 విమానం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.విమానంలోని ఇంధనాల వల్ల నీటిలోని జలచరాలకు ఎలాంటి నష్టం జరగకుండా, నీరు పాడవకుండా ఇంజిన్లను, ఇంధన ట్యాంకర్లను, విమనాం చక్రాలను తొలగించారు. అంతేకాదు కాదు విమానానికి వాటర్ ప్రూఫ్ పెయింటింగ్ వేశారు. విమానాన్ని ఇకో డిటర్జెంట్స్ తో శుభ్రం చేశారు. పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా థీమ్ పార్క్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం స్థానిక డైవింగ్ సంస్థలతో కలిసి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. బహ్రెయిన్ పరిశ్రమల శాఖ మంత్రి జాయోద్ బిన్ రషీద్ అల్ జయానీ ఈ అండర్ వాటర్ థీమ్ పార్క్ గురించి మాట్లాడుతూ.. బోయింగ్ విమానంతో పాటు కృత్రిమ పగడలు, శిల్పాలు వంటివి ఈ జల ప్రపంచంలో ఉంటాయని ఈ పార్క్‌ను ఆగస్టులో ప్రారంభిస్తామన్నారు.







Untitled Document
Advertisements