సెల్ఫ్ డ్రైవింగ్ కారును లాంచ్ చేసిన ఉబెర్

     Written by : smtv Desk | Fri, Jun 14, 2019, 05:01 PM

సెల్ఫ్ డ్రైవింగ్ కారును లాంచ్ చేసిన ఉబెర్

క్యాబ్ సర్వీసుల సంస్థ ఉబెర్ తాజాగా వోల్వో భాగస్వామ్యంతో నెక్ట్స్ జనరేషన్ సెల్ఫ్ డ్రైవింగ్ కారును ఆవిష్కరించింది. సెల్ఫ్ డ్రైవింగ్ వోల్వో ఎక్స్‌సీ90 కారు త్వరలోనే ఉబెర్ వాహన పోర్టుఫోలియోలోకి చేరబోతోంది. ఈ కారులో పై భాగంలో ఒక సెన్సర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఈ కారులో ఆటోమేటిక్ బ్రేకింగ్, స్టీరింగ్ సిస్టమ్‌ కూడా ఉంటుంది. సెన్సర్ వ్యవస్థ ఫెయిల్ అయినా కూడా ఇవి పనిచేస్తాయి. ఈ కారు వోల్వో కంపెనీదే అయినా కూడా సాఫ్ట్‌వేర్ మాత్రం ఉబెర్‌ది ఉంటుంది. ఉబెర్ ఇప్పటికే అమెరికా మార్కెట్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ వోల్వో ఎక్స్‌సీ90 మోడల్‌ను ఉపయోగిస్తోంది. స్వీడన్‌లో కూడా ఈ కార్లను నడిపేందుకు అనుమతులు ఉన్నాయి.





Untitled Document
Advertisements