షాంఘై సదస్సులో మోడీ ‘హెల్త్’ మంత్రం

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 11:39 AM

షాంఘై సదస్సులో మోడీ ‘హెల్త్’ మంత్రం

బిష్కెక్: కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న షాంఘై సహకార సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని మోడీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం, ప్రత్యామ్నాయ ఇంధనం, ఆరోగ్య, వైద్య సేవల విషయంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఎస్‌ఓసి సభ్య దేశాలకు ‘హెల్త్’ మంత్రాన్ని చెప్పారు. ‘HEALTH’ అనే పదంలో ఒకో అక్షరానికి ఒక్కో అర్థముందని చెప్పారు. హెచ్ అంటే హెల్త్ అండ్ మెడికేర్ (ఆరోగ్య సహకారం, ఇ అంటే ఎకో (పర్యావరణ సహకారం), ఎ అంటే ఆల్టర్నేట్ (ప్రత్యామ్నాయ అనుసంధానం), ఎల్ అంటే లిటరేచర్ (అక్షరాస్యతపై అవగాహన), టి అంటే టెర్రరిజం ఫ్రీ సొసైటీ (ఉగ్రవాద రహిత సమాజం),హెచ్ అంటే హ్యూమానిటీ(మానవత్వ సహకారం) అని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా ప్రపంచ దేశాలన్నీ అయిదు విషయాలలో పరస్పరం సహకరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్‌సిఓలో భారత్ రెండేళ్లుగా శాశ్వత సభ్య దేశంగా ఉందని, ఈ రెండేళ్లలో ఎస్‌సిఓ చేపట్టే అన్ని కార్యక్రమాలకు సహకారం అందించామని మోడీ చెప్పారు.





Untitled Document
Advertisements