ఆధార్ కార్డుతో 30వేలు గెలుచుకోండి!

     Written by : smtv Desk | Thu, Jul 11, 2019, 06:37 PM

ఆధార్ కార్డుతో 30వేలు గెలుచుకోండి!

ఆధార్ కార్డు ఉన్నవారికి ఓ బంపర్ ఆఫర్. మై ఆధార్ ఆన్‌లైన్ కంటెస్ట్‌లో పాల్గొని ఏకంగా రూ.30,000 వరకు గెలుచుకునే అవకాశం పొందచ్చు. ఈ పోటీలో ప్రతీ పౌరుడు పాల్గొనవచ్చు. జూలై 22 వరకు పోటీ నడుస్తుంది. పోటీలో గెలుపొందిన వారిని ఆగస్ట్ 31 లోపు ఈ-మెయిల్ రూపంలో సంప్రదిస్తామని యూఐడీఏఐ తెలిపింది. మీకు ఎలాంటి రిప్లే రాకపోతే మీరు ఓడినట్లు. పోటీలో ఎలా పాల్గొనాలి అంటే...
1 ఆధార్ డౌన్‌లోడ్ .
2 ఆధార్ అప్‌డేట్ స్టేటస్ .
3 లోకేట్ ఆధార్ కేంద్రం .
4 ఆన్‌లైన్‌లో అడ్రస్ అప్‌డేట్ .
5 అడ్రస్ వాలిడేషన్ లెటర్ రిక్వెస్ట్ .
6 ఆధార్ అప్‌డేట్ హిస్టరీ .
7 యూఐడీ, ఈఐడీ రికవరీ .
8 ఆధార్ రిప్రింట్ ఆర్డర్ .
9 ఆధార్ లాక్, అన్‌లాక్ .
10 ఆధార్ అథంటికేషన్ హిస్టరీ .
11 ఆధార్ ఆన్‌లైన్ వెరిఫికేషన్ .
12 మొబైల్ నెంబర్, ఈమెయిల్ వెరిఫికేషన్ .
13 వర్చువల్ ఐడీ జనరేషన్ .
14 బయోమెట్రిక్స్ లాక్, అన్‌లాక్ .
15 ఆన్‌లైన్ అడ్రస్ అప్‌డేట్ స్టేటస్ .వంటి అంశాలపై షార్ట్ వీడియో తీసి యూఐడీఏఐకి పంపాలి. వీడియో 30 సెకన్ల నుంచి 120 సెకన్ల మధ్యలో ఉండాలి. ఒక వీడియోలో పైన పేర్కొన్న ఏదో ఒక అంశాన్ని మాత్రమే తెలియజేయాలి. యానిమేషన్ వీడియోలు కూడా చెయొచ్చు. యూట్యూబ్‌ లేదా గూగుల్ డ్రైవ్ లేదా ఆన్‌లైన్ ఫైల్ షేరింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో వీడియోని అప్‌లోడ్ చేయాలి. లింక్‌ను ఈమెయిల్ రూపంలో media.division@uidai.net.inకు పంపాలి. లింక్‌తోపాటు మీ ఆధార్ నెంబర్, సంప్రదించాల్సిన అడ్రస్, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలు కూడా అందించాలి. మొత్తం 15 కేటగిరిలు ఉన్నాయి. ప్రతి కేటగిరిలో టాప్ 3 వీడియోలకు బహుమతి ఇస్తారు. తొలి స్థానంలో ఉన్న వీడియోకి రూ.20,000, 2వ స్థానం వీడియోకి రూ.10,000, మూడో స్థానం వీడియోకి రూ.5,000 చెల్లిస్తారు. మొత్తం వీడియోల్లో టాప్ 3 వాటికి మళ్లీ మనీ ఇస్తారు. తొలి స్థానంలోని వీడియోకి రూ.30,000, రెండో స్థానంలోని వీడియోకి రూ.20,000, మూడో స్థానం వీడియోకి రూ.10,000 అందజేస్తారు. ఆధార్‌‌తో లింకైన బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు వస్తాయి. విజేతలను సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తారు.





Untitled Document
Advertisements