మరొక వ్యక్తితో ప్రేమలో అమలాపాల్

     Written by : smtv Desk | Mon, Jul 15, 2019, 05:45 PM

కథానాయకిగా మంచి క్రేజ్ ఉన్నప్పుడే దర్శకుడు ఏ.ఎల్ విజయ్ ను ప్రేమ పెళ్ళి చేసుకుంది అమలాపాల్. కానీ వారి బంధం ఎక్కువ కాలం నిలువలేదు. రెండున్నరేళ్లలోనే మనస్పర్థలు వచ్చి విడిపోయారు. విజయ్ ఈమధ్యే వేరే పెళ్లి కూడా చేసుకున్నాడు. అమలాపాల్ ఇప్పుడిప్పుడే సినిమాలతో బిజీ అవుతోంది.

అంతేకాదు ఆమె మరొక వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అమలా ఈసారి ప్రేమించిన వ్యక్తి సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదని మాత్రం తెలుస్తోంది. అంతేకాదు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యంలో కూడా లేరట వారిద్దరూ. మొత్తానికి అమలాపాల్ కూడా మెల్లగా లైఫ్ సెట్ చేసుకుంటోందన్నమాట. ప్రస్తుతం ఆమె నటించిన కొత్త చిత్రం 'ఆమె' ఈ నెల 19న విడుదలకు సిద్ధంగా ఉంది.





Untitled Document
Advertisements