రివ్యూ : రణరంగం

     Written by : smtv Desk | Thu, Aug 15, 2019, 01:55 PM

శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శి హీరో హీరోయిన్లుగా, సుధీర్ వర్మ దర్శకతంలో తెరకెక్కిన మూవీ రణరంగం, నేడు ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల అయ్యింది. ఈ మూవీలో శర్వా మొదటిసారి గ్యాంగ్ స్టర్ గా నటిస్తుడటంతో పాటు, చిత్రంలోని పాటలు, ట్రైలర్స్ ఆకట్టుకోవడంతో మూవీ పై అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ఈ చిత్రం ఆ అంచనాలు ఎంత వరకు అందుకుందో సమీక్షలో చూద్దాం…



కథ:

దేవా(శర్వానంద్) తన మిత్రులతో కలిసి బ్లాక్ టికెట్స్ అమ్ముతూ సదా సీదాగా బ్రతికే సామాన్య కుర్రాడు. అలాంటి దేవా 1995 సంవత్సరంలో మధ్య పాన నిషేధంతో సారా బ్లాక్ మార్కెట్ దందా వలన బాగా సంపాదించే అవకాశం ఉండటంతో దేవా ఆ ఇల్లీగల్ బిజినెస్ లోకి దిగి అంచలంచెలుగా ఎదుగుతాడు. ఆలా ఓ సామాన్య కుర్రాడు అందరిని భయపెట్టే గ్యాంగ్ స్టర్ స్థాయికి ఎలా ఎదిగాడు? ఆలా ఎదిగే క్రమంలో దేవా ఎదుర్కొన్న సమస్యలు ఏమిటీ? దేవా ని మట్టుబెట్టాలని ఎదురుచూస్తున్న శత్రువుల నుండి ఎలా బయటపడ్డాడు? అనేది మిగతా కథాంశం.



విశ్లేషణ:

రణరంగం మూవీ రెండు విభిన్న కాలాలలో సాగే గ్యాంగ్ స్టర్ స్టోరీ. 90లనాటి యువకుడిగా, ప్రస్తుతం కాలంలో గ్యాంగ్ స్టర్ గా శర్వా నటన ఆకట్టుకుంటుంది. యాక్షన్ సన్నివేశాలతో పాటు భావోద్వేగ సన్నివేశాలలో శర్వా ఆకట్టుకుంటాడు. ఇంతకు ముందు శర్వా ఇలాంటి గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించక పోవడంతో ప్రేక్షకులకు ఓ కొత్త భావన కలుగుతుంది.

ఇక ఈ కాజల్ డాక్టర్ గా పాత్రకు చక్కగా సరిపోయారని చెప్పాలి. మొదటి సగంలో కాజల్ పాత్రకు కి అంతగా స్కోప్ లేదు. రెండవ సగంలో మాత్రం ఆమె నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా పతాక సన్నివేశాలలో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన బాగుంది.
ఇక మరో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శి 90ల కాలం నాటి ఆమ్మాయిగా ఆ పాత్రకు చక్కగా సరిపోయింది.ఓణీలలో ప్రతి సన్నివేశంలో ఆమె అమాయకత్వంతో కూడిన క్యూట్ నెస్ తో ఆకట్టుకుంటుంది.

దర్శకుడు సుధీర్ వర్మ తాను చెప్పాలనుకున్న విషయాన్నీ తెరపై ఆవిష్కరించడంలో తడబడ్డాడనిపిస్తుంది. ఆయన అసలు కథలోకి వెళ్ళడానికి చాల సమయం తీసుకున్నారు. రెండవ సగంలో మరీ ఆయన రొటీన్ సన్నివేశాలతో విసిగించారు. మొదటిసగం పర్వాలేదనిపించగా, రెండవ సగంలో ఆయన సహనానికి పరీక్ష పెట్టారు. ఐతే గ్యాంగ్ స్టర్ గా శర్వాని ప్రెసెంట్ చేసిన తీరు బాగుంది.

ఇక మూవీలో సాంగ్స్ కొంచెం ఉపశమనంగా చెప్పుకోవచ్చు. ప్రశాంత్ పిళ్ళై మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. అలాగే దివాకర్ మణి కెమెరా పనితనం సన్నివేశాలు తెరపై రిచ్ గా చూపించింది. ఎడిటింగ్ మాత్రం ఆకట్టుకోదు. మూవీలో చాలా అనవసర సన్నివేశాలున్న భావన కలుగుతుంది.



ప్లస్ పాయింట్స్:

హీరో,హీరోయిన్ల నటన
మ్యూజిక్
గ్యాంగ్ స్టర్ ని ప్రెసెంట్ చేసిన విధానం
సినిమాటోగ్రఫీ



మైనస్ పాయింట్స్:

కథ
స్క్రీన్ ప్లే
కథలో ప్లో లేకపోవడం
నెమ్మదిగా సాగే కథనం.



తీర్పు:

రణరంగం మూవీ రొటీన్ గా సాగే గ్యాంగ్ స్టర్ స్టోరీ అని చెప్పాలి. శర్వా పాత్రను చక్కగా ఎలివేట్ చేసిన దర్శకుడు మిగతా కథా,కథనాలపై అంతగా ద్రుష్టి సారించలేదు. నెమ్మదిగా సాగే రొటీన్ డ్రామా ప్రేక్షకుడికి ఆసక్తి కలిగించదు. చిత్రంలో మ్యూజిక్, కొన్ని కామెడీ సన్నివేశాలు కొంత ఉపశమనం ఇస్తాయి. మొత్తంగా చెప్పాలంటే రణరంగం అంతగా ఆకట్టుకోదు అని చెప్పొచ్చు.

Rating: 2.5/5





Untitled Document
Advertisements