చైనాతో ఒప్పందాలకు ఎప్పుడూ సిద్ధమే!

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 11:36 AM

చైనాతో ఒప్పందాలకు ఎప్పుడూ సిద్ధమే!

చైనాతో వ్యాపార, వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు తాము ఎప్పుడూ సిద్ధమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశాడు. ఇదివరకు చైనా ఎగుమతులపై సుంకాలు పెంచుతూ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన ట్రంప్ తాజాగా ఇలా ప్రకటించడం గమనర్హం. అయితే వాణిజ్య ఒప్పందాలు నిబంధనలకు లోబడి ఉంటేనే ముందుకు వెళ్తాయని ట్రంప్ స్పష్టం చేశారు. చైనాతో మా సంబంధాల పురోభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని, ఇది నిజమని, వారితో ఏ ఒప్పందం చేసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.దిగివచ్చిన ట్రంప్ ఒప్పందాలకు నిబంధనలు, షరతుల విషయంలో వెనక్కి తగ్గేది లేదని, అలా చేయకపోతే ఒప్పందాలకు అర్థం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితికి కారణంగా చైనాను వేలెత్తి చూపబోమని, అందుకు అమెరికా గత ప్రభుత్వాలే కారణమని ట్రంప్ ఆరోపించారు. కాగా చైనాకు ఉత్పత్తులపై అదనంగా మరో 10శాతం పన్నులు విధించాలన్న నిర్ణయాన్ని డిసెంబరు 15వరకూ వాయిదా వేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తర్వాత అమెరికా మార్కెట్లు దారుణంగా పతనమయ్యాయి.





Untitled Document
Advertisements