ఇతర మహిళల సినిమాలను ఎందుకు ప్రమోట్ చేయడం లేదు!

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 04:46 PM

ఇతర మహిళల సినిమాలను ఎందుకు ప్రమోట్ చేయడం లేదు!

బాలీవుడ్ స్టార్ కంగనా రనౌత్‌, తాప్సి మధ్య మాటల యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. అవకాశం దొరికినప్పుడల్లా ఆమెపై తాప్సీ విమర్శలు చేస్తూనే ఉంది. ఇటీవల తాప్సీ తన సోదరిని అనుకరిస్తోందని అంటూ రంగోలీ విమర్శలు చేసింది. కంగనాకు తాప్సీ ఒక చౌకబారు నకలు అని రంగోలీ వ్యాఖ్యానించింది. ఇప్పటికే ఆ విషయంలో తాప్సీ స్పందించింది. రంగోలీ వ్యాఖ్యలను స్వాగతిస్తూనే తాప్సీ సెటైర్లు వేసింది. తాను చౌక అనే విషయాన్ని ఒప్పుకుంటూ కంగనా స్థాయి రెమ్యూనరేషన్ తాను తీసుకోనంటూ తాప్సీ వ్యంగ్యంగా స్పందించింది. అయితే తాజాగా మరోసారి తాప్సీ స్పందించింది.కంగనాను ఉద్దేశించి ఆమె పంచ్‌లు వేసింది. తమ తాజా సినిమా ‘మిషన్ మంగళ్’ను కంగనా ఎక్కడా ప్రస్తావించకపోవడాన్ని తాప్సీ గుర్తు చేసింది. “ఇండస్ట్రీలోని హీరోయిన్లకు కంగనా ఒక మాట చెబుతూ ఉంటారు. హీరోయిన్లు ఒకరికి ఒకరు సహకరించుకోవాలని కంగనా చెబుతుంటారు. మరి ‘మిషన్ మంగళ్’లో ఐదు మంది హీరోయిన్లం నటించాం. ఇది మహిళా ప్రధానమైన సినిమా. ఈ సినిమాను కంగనా ఎక్కడా ప్రమోట్ చేయలేదు. తను ప్రధాన పాత్రలో నటించే సినిమాలను అందరూ ప్రమోట్ చేయాలనే కంగనా – ఇతర మహిళా ప్రధానమైన సినిమాలను ఎందుకు ప్రమోట్ చేయడం లేదు” అంటూ తాప్సీ చురకలు అంటించింది.





Untitled Document
Advertisements