మరింత తగ్గుముఖం పట్టిన ఇంధన ధరలు

     Written by : smtv Desk | Sat, Oct 05, 2019, 08:02 AM

మరింత తగ్గుముఖం పట్టిన ఇంధన ధరలు

దేశీయ ఇంధన ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. శనివారం(అక్టోబర్5)న ెట్రోల్ ధర 31 పైసలు, డీజిల్ ధర 22 పైసలు చొప్పున దిగొచ్చింది. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ. 78.73కు తగ్గింది. డీజిల్ ధర రూ.73.22కు క్షీణించింది. పెట్రోల్ ధర తగ్గడం ఇది వరుసగా మూడో రోజు కావడం గమనార్హం మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 30 పైసలు తగ్గుదలతో రూ.78.32కు క్షీణించింది. డీజిల్‌ ధర కూడా 21 పైసలు క్షీణతతో రూ.72.47కు తగ్గింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 30 పైసలు తగ్గుదలతో రూ.77.95కు క్షీణించింది. డీజిల్ ధర 21 పైసలు క్షీణతతో రూ.72.13కు తగ్గింది.దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 29 పైసలు తగ్గుదలతో రూ.74.04కు క్షీణించింది. డీజిల్ ధర కూడా 20 పైసలు క్షీణతతో రూ.67.15కు తగ్గింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 28 పైసలు తగ్గుదలతో రూ.79.65కు క్షీణించింది. డీజిల్ ధర 22 పైసలు క్షీణతతో రూ.70.39కు తగ్గింది.





Untitled Document
Advertisements