300 ఎలుకలను పెంచుతున్న మహిళ...వాటి ప్రవర్తన మారడంతో!

     Written by : smtv Desk | Mon, Oct 21, 2019, 01:45 PM

300 ఎలుకలను పెంచుతున్న మహిళ...వాటి ప్రవర్తన మారడంతో!

ఓ మహిళ ప్రేమతో ఏకంగా 300 ఎలుకలను పెంచుకుంటుంది. శాన్ డియాగోకు చెందిన కర్ల అక్టోబరు 8న హ్యూమనే సొసైటీకి ఫోన్ చేసింది. తన పెంపుడు ఎలుకలు అదుపుతప్పి ప్రవర్తిస్తున్నాయని, సాయం చేయండని తెలిపింది. దీంతో అధికారులు అక్కడికి చేరుకుని.. ఆ ఎలుకలను ఉంచుతున్న వ్యాన్ తలుపులు తెరిచి ఆశ్చర్యపోయారు. అవి వ్యాన్‌లోని వైర్లు, సీటు కొరికేశాయి. కొన్ని వ్యాన్ తలుపు సందుల్లో దాక్కున్నాయి. కర్లా వాటిని ఎప్పటి నుంచో పెంచుతోంది. అవి బోన్ల నుంచి బయటకు వచ్చినా.. ఆహారం కోసం తిరిగి ఆ వ్యాన్ వద్దకు చేరుకుంటాయి. అయితే, అవి ఎప్పటిలా కాకుండా ఈసారి క్రమశిక్షణ తప్పాయి. వ్యాన్‌ను చిందరవందర చేశాయి. కర్లా ఫిర్యాదు మేరకు అధికారులు వ్యాన్ తనిఖీ చేసి ఆ ఎలుకలను స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ‘‘ఆమె ఆ ఎలుకలను ప్రేమతో పెంచుతోంది. వాటికి తగిన ఆహారం, నీళ్లు పెడుతోంది. ఇది జీవ హింసలోకి రాదు. వాటిని మాతో తీసుకెళ్లేందుకు కర్లా ఒప్పుకుంది’’ అని తెలిపారు.





Untitled Document
Advertisements