కశ్మీర్ లో రైలు సర్వీసులు పునరుద్ధరణ

     Written by : smtv Desk | Mon, Nov 18, 2019, 06:43 AM

కశ్మీర్ లోయలో రైలు సర్వీసులు పూర్తిగా పునరుద్ధరించబడ్డాయి. భద్రతా పరమైన కారణాల వల్ల మూడు నెలలుగా రైలు సర్వీసులు తిరగడం లేదన్న సంగతి తెలిసిందే. దక్షిణ కశ్మీర్ మీదుగా శ్రీనగర్ నుంచి బనీహాల్ వరకు రైళ్లు నడుస్తున్నాయి. ప్రస్తుతానికి ఆదివారం ఒకే ట్రిప్పులో రైళ్లు నడిపారు. సోమవారం నుంచి రోజూ రెండు ట్రిప్పులు రైలు నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. శనివారం నాడు శ్రీనగర్ నుంచి బనీహాల్ వరకు రెండుసార్లు ట్రయల్ రన్ సర్వీసులు నడిపారు. ఆదివారం ఉదయం అసలు సర్వీస్ ప్రారంభానికి ముందు ఉదయం ఒకసారి ట్రయల్ రన్ సర్వీస్ నడిపారు. వారం మార్కెట్ కారణంగా వినియోగదారుల రద్దీ ఎక్కువగా కనిపించింది. నగరం లోని కొన్ని రూట్లలో కొన్ని మినీ బస్సులు, క్యాబ్‌లు, ఆటోలు నడిచాయి.

Untitled Document
Advertisements