టీమిండియాని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు...!

     Written by : smtv Desk | Mon, Dec 09, 2019, 02:36 PM

టీమిండియాని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు...!

ఆదివారం రాత్రి విండీస్ తో ముగిసిన రెండో టీ20 మ్యాచ్‌లో పేలవ ఫీల్డింగ్ కారణంగా పరాజయాన్ని చవిచూసిన టీమిండియాపై అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 171 పరుగుల లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ టీమ్‌ని ముందుండి నడిపించిన ఓపెనర్ సిమన్స్ (67: 45 బంతుల్లో 4x4, 4x6) ఇచ్చిన సులువైన క్యాచ్‌ని ఆరంభంలోనే ఫీల్డర్ వాషింగ్టన్ సుందర్ వదిలేయగా.. మరో ఓపెనర్ ఎవిన్ లావిస్ (40: 35 బంతుల్లో 3x4, 3x6) క్యాచ్‌ని వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేజార్చాడు. ఆఖర్లోనూ నికోలస్ పూరన్ (38 నాటౌట్: 18 బంతుల్లో 4x4, 2x6) క్యాచ్‌ని మనీశ్ పాండే వదిలేయడంతో లక్ష్యాన్ని విండీస్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసింది. మొత్తంగా ఫీల్డింగ్ తప్పిదాలోనే టీమిండియా ఓడిపోయిందని కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అంగీకరించాడు. మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. శివమ్ దూబే (54: 30 బంతుల్లో 3x4, 4x6) హాఫ్ సెంచరీ బాదడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. కానీ.. బౌలింగ్, ఫీల్డింగ్‌లో మాత్రం భారత్ జట్టు ఆశించిన మేర రాణించలేకపోయింది. ఒకవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌండరీ లైన్ వద్ద ప్రమాదకరరీతిలో డైవ్ చేస్తూ క్యాచ్‌‌ అందుకున్నా.. సుందర్, పంత్, మనీశ్ పాండే మాత్రం సులువుగా అందుకోవాల్సిన క్యాచ్‌లను చేజార్చి అందర్నీ నిరాశపరిచారు. దీంతో.. ఇప్పుడు అభిమానులు టీమిండియా ఫీల్డింగ్‌పై జోక్‌లు పేలుస్తున్నారు. వాస్తవానికి గత శుక్రవారం జరిగిన తొలి టీ20లోనూ భారత్ జట్టు ఫీల్డింగ్ తప్పిదాలకి పాల్పడింది. వాషింగ్టన్ సుందర్ ఒక క్యాచ్‌ని వదిలేయగా.. రోహిత్ వర్మ వరుసగా రెండు క్యాచ్‌లను చేజార్చాడు. కానీ.. ఛేదనలో విరాట్ కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టుని ఆదుకోవడంతో ఆ ప్రభావం మ్యాచ్ ఫలితంపై పడలేదు. అయితే.. రెండో టీ20లో మాత్రం ఫీల్డింగ్ తప్పిదాలు మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయి. ముఖ్యంగా.. సిమన్స్, ఎవిన్ లావిస్ ఆరంభంలోనే ఔటయ్యే ఉండుంటే..? కచ్చితంగా విండీస్‌ ఒత్తిడిలోకి వెళ్లేది. ఉప్పల్ టీ20లో విలియమ్స్ బౌలింగ్‌ని ఉతికారేసిన విరాట్ కోహ్లీ నోట్‌బుక్ సంబరాలతో అతడ్ని కవ్వించగా.. రెండో టీ20లో కోహ్లీని ఔట్ చేసిన విలియమ్స్ సైలైన్స్ సంబరాలు చేసుకుంటూ కనిపించాడు.









Untitled Document
Advertisements