మహేష్ మాస్ స్టెప్పులకు థియేటర్ దద్దరిల్లిపోతుంది

     Written by : smtv Desk | Tue, Jan 14, 2020, 12:00 PM

సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో క్రేజీ మూవీగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజైంది. అనీల్ మార్క్ కామెడీ.. సూపర్ స్టార్ మహేష్ మార్క్ మాస్ అంశాలతో వచ్చిన ఈ సినిమాలో చాలా సర్ ప్రైజెస్ ఉన్నాయి. కొన్నాళ్లుగా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తూ వచ్చిన మహేష్ బాబు పూర్తిగా కమర్షియల్ ఎంటర్టైనర్ గా చేసిన సినిమా సరిలేరు నీకెవ్వరు.

ఈ సినిమాలో మరో స్పెషల్ సర్ ప్రైజ్ ఏంటంటే మైండ్ బ్లాక్ సాంగ్ లో మహేష్ డ్యాన్సులు అదరగొట్టాడు. లుంగీతో దుమ్ముదుమ్ము చేసేశాడు మహేష్ బాబు. ఇదే విషయాన్ని సినిమా థ్యాంక్స్ మీట్ లో చెప్పారు మహేష్ బాబు. ఈ సినిమాకు ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు మహేష్ తన ఫ్యాన్స్ తో పాటుగా ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు. ఇక సినిమాకు పనిచేసిన అందరి గురించి చెబుతూ వచ్చిన మహేష్ తన 20 ఏళ్ల కెరియర్ లో తన డ్యాన్స్ గురించి ఇంతగా మాట్లాడటం ఇదే మొదటిసారి అని.. అందుకు శేఖర్ మాస్టర్ కు థ్యాంక్స్ అన్నారు మహేష్. మహేష్ ఎప్పుడు రాజు సుందరం మాస్టర్ తోనే కొరియోగ్రఫీ చేయిస్తాడు.. ఈసారి కొత్తగా అనీల్ రావిపుడి శేఖర్ మాస్టర్ తో ట్రై చేయించాడు. అంతే సినిమాలో మైండ్ బ్లాంక్ సాంగ్ మహేష్ మాస్ స్టెప్పులకు థియేటర్ దద్దరిల్లిపోతుంది.

Untitled Document
Advertisements