రజనీపై కేసు నమోదు!

     Written by : smtv Desk | Sat, Jan 18, 2020, 09:12 PM

రజనీపై కేసు నమోదు!

సూపర్ స్టార్ రజనీకాంత్‌ రాజకీయ అరంగేట్రం కన్‌ఫార్మ్‌ అయిన దగ్గర నుంచి ఆయన తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. తాజాగా ద్రావిడ పితామహుడు తందై పెరియార్‌పై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఆయన్న ఇబ్బందుల్లో పడేశాయి. ద న్యూస్‌ మినిట్‌ కథనం మేరకు ఈ నెల 14న జరిగిన తుగ్లక్‌ పత్రిక 50వ వార్షికోత్సవంలో పాల్గొన్న రజనీ తందై పెరియార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1971లో సేలంలో నిర్వహించిన ఓ ర్యాలీలో పెరియార్‌ సీతా రాముల ప్రతిమలను నగ్నంగా తీసుకెళ్లారని రజనీ వ్యాఖ్యానించినట్టుగా ద న్యూస్‌ మినిట్‌ పేర్కొంది. అంతేకాదు ఆ సమయంలో ఒక్క తమిళ మేగజైన్‌ మాత్రం ఈ వార్తను ప్రచురించిందని ప్రభుత్వం ఈ వార్త బయటకు రాకుండా జాగ్రత్త పడిందని రజనీ వ్యాఖ్యనించినట్టుగా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై ద్రావిడర్‌ విడుదలై కళగం నేతలు మండిపడ్డారు. పెరియార్‌పై, ఆయన నిర్వహించిన కార్యక్రమాలపై రజనీ అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు రజనీ తన వ్యాఖ్యలతో పెరియార్‌ గౌరవానికి భంగం కలిగించారంటూ కోవై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కామెంట్స్‌పై స్పందించిన నెహ్రూ దాస్‌ రజనీకాంత్‌ రాజకీయ రంగం ప్రవేశం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యల్లో ఏ మాత్రం నిజం లేదని అన్నారు. అంతేకాదు కోయంబత్తూర్‌ కమిషనర్‌ను రజనీకాంత్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్టుగా వెల్లడించారు.






Untitled Document
Advertisements