ఏకంగా 33 శాతం పెరిగిన హెచ్‌డిఎఫ్‌సి లాభాలు!

     Written by : smtv Desk | Sun, Jan 19, 2020, 04:12 PM

ఏకంగా 33 శాతం పెరిగిన హెచ్‌డిఎఫ్‌సి లాభాలు!

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గత డిసెంబర్ 31తో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అంచనాలను మించిన పని తీరు తో అద్భుత ఫలితాలు సాధించింది. మూడో త్రైమాసికం లో బ్యాంక్ నికర లాభాలు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఏకంగా 33 శాతం పెరిగాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ.5,585.9 కోట్లు ఉండగా ఇప్పుడది రూ. 7,416.5 కోట్లకు పెరిగింది. అలాగే మొత్తం ఆదాయం కూడా గత ఏడాది ఆర్జించిన రూ.30, 811.27 కోట్లనుంచి రూ. 36,039 కోట్లకు పెరిగినట్లు హెచ్‌డిఎఫ్‌సి బ్యాం క్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేసింది. బ్యాంకు రుణ వితరణ 19.9%, డిపాజిట్లు 25.2% పెరిగిన కారణంగా 2019 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం ఇంతకు ముందు ఏడాదిలో ఉన్న రూ. 12,576.8 కోట్లనుంచి రూ.14,172.9 కోట్లకు పెరిగింది’ అని ఆ ప్రకటన పెరిగింది. మరో వైపు గత ఏడాదితో పోలి స్తే ఈ త్రైమాసికంలో బ్యాంక్ నిరర్థక ఆస్తులు మొత్తం రుణాల్లో 1.42%నికి పెరిగాయి. గత ఏడాది ఇదే సమయంలో బ్యాంక్ ఎన్‌పిఎలు మొత్తం రుణాల్లో 1.38% గానే ఉన్నాయి. ఫలితంగా దీనికోసం బ్యాంక్ కేటాయించిన మొత్తం కూడా పెరిగింది. మరో వైపు వడ్డీ ఆదాయం కాకుండా ఇతర ఆదాయాలు సైతం గత ఏడాది ఇదే సమయంలో ఉన్న రూ. 4,921.01 కోట్లనుంచి రూ.6,669.3 కోట్లకు పెరిగాయి. అలాగే మొత్త డిపాజిట్లు 25.2 శాతం పెరిగి రూ.10,67,433 కోట్లకు చేరుకోగా, అందించిన మొత్తం రుణాలు 19.9% పెరిగి రూ.9,36,030 కోట్లకు చేరుకున్నాయని బ్యాంక్ ఆ ప్రకటనలో తెలిపింది.





Untitled Document
Advertisements