చరణ్, వరుణ్ ఓల్డ్ లుక్..వైరల్ పిక్

     Written by : smtv Desk | Mon, Jan 20, 2020, 06:02 PM

చరణ్, వరుణ్ ఓల్డ్ లుక్..వైరల్ పిక్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ను వృద్ధ రూపంలో చూసిన మెగా అభిమానులు వాహ్ అంటున్నారు. ఆదివారం (జనవరి 19న) వరుణ్ తేజ్ పుట్టినరోజును పురష్కరించుకుని రామ్ చరణ్ ఆయనకి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అది కూడా చాలా ప్రత్యేకంగా చెప్పారు. వరణ్‌తో కలిసి గతంలో తాను తీసుకున్న ఒక ఫొటోను ఫేస్ యాస్ ఉపయోగించి ఓల్డేజ్ ఫొటోలా తయారు చేశారు. ఈ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వయసు మళ్లుతుండటాన్ని ఆస్వాదించు వరుణ్ అని రామ్ చరణ్ పేర్కొన్నారు. అయితే, ఈ ఫొటోలో చరణ్, వరుణ్ ఓల్డ్ లుక్‌లో భలే ఉన్నారు. నిజం చెప్పాలంటే వయసు మళ్లిన హాలీవుడ్ హీరోల్లా ఉన్నారు.

View this post on Instagram

Happy birthday @varunkonidela7 !! Enjoy getting old!!

A post shared by Ram Charan (@alwaysramcharan) on





Untitled Document
Advertisements