మళ్లీ పడిపోయిన మార్కెట్..సెన్సెక్స్ 200 పాయింట్లు పతనం

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 08:11 PM

మళ్లీ పడిపోయిన మార్కెట్..సెన్సెక్స్ 200 పాయింట్లు పతనం

బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా రెండో కూడా నష్టపోయాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) భారత్ వృద్ధి అంచనాలను తగ్గించడంతో బెంచ్‌‌మార్క్ సూచీలపై ప్రతికూల ప్రభావం పడింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 4.8 శాతంగా ఉండొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఎన్‌బీఎఫ్‌సీలపై ఒత్తిడి, గ్రామీణ ప్రాంత ఆదాయ వృద్ధి బలహీనంగా ఉండటం వంటి అంశాలు వృద్ధి రేటు తగ్గింపునకు కారణం. ఇంకా టాప్ కంపెనీలు బలహీనమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. మంగళవారం సెన్సెక్స్ 205 పాయింట్ల నష్టంతో 41,324 వద్ద, నిఫ్టీ 55 పాయింట్ల నష్టంతో 12,170 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. ఆటో రంగ షేర్లలో అమ్మకాలు కొనసాగాయి. మెటల్ షేర్లపై ఒత్తిడి కనిపించింది. నిఫ్టీ 50లో భారతీ ఇన్‌ఫ్రాటెల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, బీపీసీఎల్, కోల్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. భారతీ ఇన్‌ఫ్రాటెల్ ఏకంగా 9 శాతం పెరిగింది. అదేసమయంలో టాటా స్టీల్, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, ఏసియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ షేర్లు నష్టపోయాయి. టాటా స్టీల్ 3 శాతానికి పైగా పడిపోయింది. నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్, నిఫ్టీ మెటల్ ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా పడిపోయాయి. నిఫ్టీ మీడియా ఇండెక్స్ ఏకంగా 2 శాతానికి పైగా పరుగులు పెట్టింది.





Untitled Document
Advertisements