‘‘కేటీఆర్‌ గారు సినిమా చూడండి సార్’’ : బన్నీ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

     Written by : smtv Desk | Tue, Jan 21, 2020, 08:15 PM

‘‘కేటీఆర్‌ గారు సినిమా చూడండి సార్’’ : బన్నీ ఫ్యాన్స్ రిక్వెస్ట్!

‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘సామజవరగమన’ సాంగ్ ఎంత సెన్సేషనల్ అయ్యిందో తెలిసిందే. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట ‘సాంగ్ ఆఫ్ ది ఇయర్‌’గా నిలిచింది. సంగీత ప్రియులందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తోన్న ఈ పాట తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను కూడా కట్టిపడేసింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ పాట త‌న‌కి మ‌ర‌చిపోలేని అనుభూతిని మిగిల్చింద‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఉన్న కేటీఆర్ తనకు ‘సామజవరగమన’ మంచి కంపెనీ ఇస్తోందని పేర్కొన్నారు. ‘‘విమానం లాండింగ్ ఆలస్యమైంది. స్విస్ కాలమానం ప్రకారం ఉదయం 3.30 గంటలకు దిగాను. నా ప్లే లిస్టులో ఉన్న సామజవరగమన నాకు మంచి కంపెనీ ఇచ్చింది. అద్భుతమైన పాట. తమన్ తన స్థాయికి మించి ఈ పాటను స్వరపరిచాడు. ఈ పాటను నా బుర్రలో నుంచి తీసేయలేకపోతున్నాను’’ అని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. కేటీఆర్ ట్వీట్‌కు తమన్ వెంటనే స్పందించారు. తనపై కేటీఆర్ ప్రశంసలు కురిపించడంతో తమన్ ఆనందం పట్టలేకపోయారు. తనకెంతో ఇష్టమైన వ్యక్తి నుంచి ఇంత మంచి ప్రశంస వచ్చిందని మురిసిపోయారు. ‘‘మీరు మా పాటను మరింత సెన్సేషనల్ చేశారు’’ అంటూ ట్విట్టర్‌లో కేటీఆర్‌కు రిప్లై ఇచ్చారు. మరోవైపు, కేటీఆర్ ట్వీట్‌కు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ముగ్ధులైపోయారు. తెలంగాణ మంత్రి నుంచి తమ హీరో సాంగ్‌కు కాంప్లిమెంట్ రావడంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. ‘‘సినిమా చూడండి సార్’’ అని కోరుతున్నారు.Untitled Document
Advertisements