ఇంట్లో గ్రహదోషాలతో తలెత్తే ఇబ్బందులివే!

     Written by : smtv Desk | Thu, Feb 13, 2020, 07:02 PM

ఇంట్లో గ్రహదోషాలతో తలెత్తే ఇబ్బందులివే!

తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తర దిక్కుల్లో నవగ్రహాల దోషాలు తలెత్తితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో ఇంతకు ముందు ఆర్టికల్‌లో చూశాం. ఇప్పుడు ఉపదిక్కులలో నవగ్రహాల ఫలితాలను తెలుసుకుందాం. ఆగ్నేయానికి దిక్పతి అగ్ని, నవగ్రహాలలో శుక్రుడు అధిపతి. శుక్ర గ్రహానికి సంబంధించిన ఆగ్నేయ దోషాలు ఏర్పడితే.. గృహంలో యజమానురాలికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. బ్రెస్ట్ కాన్సర్, గర్భ సంచి దోషాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలి అంటే కోడలు ఈ గృహంలో వంటావార్పు చేయదు. వివాహ విచ్ఛదనకు కూడా ఆగ్నేయ దోష శుక్రుడు కారకుడుగా మారతాడు.


నైరుతిలో దిక్పతి నిరుతి. అందరూ రాక్షస స్థానంగా మాత్రమే దీన్ని వర్ణిస్తారు. కానీ ఇది పితృ (వంశ) స్థానంగా చూడాలి. ఈ ప్రదేశంలోని గ్రహం రాహువు. నైరుతిలో దోషం ఏర్పడితే యజమాని చెడు వ్యసనాలకు బానిస అవుతాడు. ఆస్తులు కర్పూరంలా కరిగి పోతాయి. కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. పగటి కలలు కంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఈ స్థాన దోషం వల్ల రాజకీయ నాయకులు అపమృత్యు పాలవుతారు. వ్యాపారస్తులు అప్పుల పాలవుతారు.

ఇక మూడోది వాయువ్యం. దిక్పతి వాయువు కాగా. గ్రహం చంద్రుడు. ఈ స్థలంలోని చంద్ర దోషం వల్ల ప్రేమ వివాహాలు, అక్రమ సంబంధాలు జరిగే అవకాశం ఎక్కువ. నైరుతి లాగే రాజకీయ నాయకులకు వాయువ్య చంద్రుడు అత్యంత ప్రాధాన్యతాంశం. రీ కౌంటింగ్‌లో ఓడిపోవడం,
కోర్టులు గెలుపును అంగీకరించకపోవడం, హృదయ సంబంధ రోగాలు వాయువ్య చంద్ర దోషం కారణంగా ఏర్పడతాయి.

నాలుగోది ఈశాన్యం. దీనికి దిక్పతి ఈశ్వరుడు, గ్రహాలు గురువు, కేతువు. ఈ ప్రదేశంలోని దోషాల వల్ల చదువుకొనే పిల్లలపై ఎక్కువగా ప్రభావం పడుతుంది. విద్యార్థులు పరీక్షలు తప్పడం, చెడు అలవాట్లు నేర్చుకోవడం, వాహన ప్రమాదాల బారిన పడటం, నాస్తికులుగా మారడం లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వెన్నెముకకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.

ఈ ఎనిమిది దిక్కులతోపాటు రెండు ప్రతి దిక్కులు కూడా ఉన్నాయి. అవి 1. ఊర్థతము, 2.అధోతము. ఒకటి పై భాగం కాగా రెండోది కింది భాగం. వీటిని కూడా కలిపి దశ దిక్కులు అంటారు. పై భాగానికి అధిపతులు సూర్య, చంద్రులు కాగా.. కింది భాగానికి అధిపతి కుజుడు మరియు వృక్ష, పశు పక్ష్యాదులు.





Untitled Document
Advertisements