నిమ్స్ లో డాక్టర్లు కరువు!!

     Written by : smtv Desk | Thu, Feb 27, 2020, 02:52 PM

నిమ్స్ లో డాక్టర్లు కరువు!!

నిమ్స్ లో సీనియర్ డాక్టర్ల సంఖ్య తగ్గుతోంది. ఇప్పటికే చాలామంది రిటైర్ అవగా…. మరికొందరు రిటైర్మెంట్ కు దగ్గరల్లో ఉన్నారు. ప్రొఫెసర్స్ రిటైర్మెంట్ వయసు 58 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం 2019లో జీవో జారీ చేసినా.. ఇప్పటి వరకు నిమ్స్ లో మాత్రం అమలు కావడం లేదు. మెడికల్ కాలేజీల్లో సీనియర్ ప్రొఫెసర్స్ అవసరం పెరగడంతో.. రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును పెంచింది. 2019 జూన్ లో జీవో జారీ చేసింది. డీఎంఈ కింద ఉన్న మెడికల్ కాలేజీలు, టీచింగ్ ఇనిస్టిట్యూట్స్, అటానమస్, సెమీ అటానమస్ ల్లో రిటైర్మెంట్ వయసును 58 నుంచి 65ఏళ్లకు పెంచుతూ జీవో ఇచ్చింది. అయితే ఈ జీవో నిమ్స్ లో మాత్రం అమలు కావడం లేదు. జీవో విడుదలై 8 నెలలు అవుతున్నా.. నిమ్స్ లో అమలు కాకపోవడంపై కొందరు డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు రిటైర్ అవగా.. మరో మూడు నెలల్లో మరికొందరు పదవీ విరమణ చేస్తారు. దీంతో ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్, స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతకుమారికి నిమ్స్ డాక్టర్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు. మరోవైపు నిమ్స్ డైరెక్టర్ మనోహర్ ను కలిసి నెల రోజుల్లోనే జీవో అమలయ్యేలా చూడాలని కోరతామంటున్నారు నిమ్స్ రెసిడెన్స్ డాక్టర్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్. రిటైర్మెంట్ ఏజ్ పెంచితే జూనియర్స్ కు అన్యాయం జరుగుతుందన్న మాటల్లో వాస్తవం లేదంటున్నారు మరికొందరు డాక్టర్లు. ప్రమోషన్స్ అన్నీ టైంకి జరిగితే నష్టం లేదంటున్నారు. ఇప్పటికే గత కొంత కాలంగా నిమ్స్ లో ప్రమోషన్స్, రిక్రూట్మెంట్ జరగడం లేదనీ, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియామకం జరగకపోగా ఉన్న అసిస్టెంట్లకు అసోషియేట్ గా ప్రమోషన్స్ ఇవ్వట్లేదని ఆరోపిస్తున్నారు. అసిస్టెంట్, అసోషియేట్ ప్రొఫెసర్స్ గా చేస్తున్నవారు రిటైర్మెంట్ ఏజ్ పెంచడాన్ని సమర్ధించడం లేదు. ఏడేళ్లు రిటైర్మెంట్ ను ఆపితే తమకు అన్యాయం జరుగుతుందంటున్నారు. ఏజ్ పెంచడం వల్ల వచ్చే ప్రయోజనం పెద్దగా ఉండదంటున్నారు మరికొందరు. 58ఏళ్లలో రిటైర్మెంట్ అయితే ప్రైవేట్ హాస్పిటల్స్ లో వర్క్ చేయడం.. లేదంటే సొంతంగా హాస్పిటల్స్ పెట్టుకుంటే తమకే మంచిదంటున్నారు. కొందరు సీనియర్స్ పెద్దగా పని చేయరనీ.. అలాంటి వాళ్లు ఎప్పుడు రిటైర్డ్ అయితే ఏంటని ప్రశ్నిస్తున్నారు.





Untitled Document
Advertisements