మాస్ కా దాస్ మరో సినిమా ప్రైమ్ లో.!

     Written by : smtv Desk | Wed, Apr 01, 2020, 12:48 PM

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ మాస్ హీరో విశ్వక్ సేన్ తన మొదటి సినిమా ఫలక్ నామా దాస్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకొని నిజంగానే మాస్ కా దాస్ అనిపించుకున్నాడు. దీని తర్వాత నాచురల్ స్టార్ నాని నిర్మాణంలో శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “హిట్” తో అనుకున్న దానిని మించే హిట్టు కొట్టాడు.

అయితే థియేటర్స్ లో సందడి చేసిన ఈ చిత్రం ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లోకి వస్తుంది అని కొన్ని వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ ఈ ఏప్రిల్ 1 నుంచే అందుబాటులోకి వచ్చేస్తుంది అని నానియే తన ట్విట్టర్ ద్వారా కూడా తెలిపారు. అలా నాని చెప్పినట్టుగానే ఈ చిత్రం ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం ఈ లాక్ డౌన్ లో దీనిని కూడా ఒక లుక్కెయ్యండి.





Untitled Document
Advertisements