పీఎం కేర్స్ ఫండ్ విషయమై మోదీపై రాహుల్ ఘాటు వాఖ్యలు

     Written by : smtv Desk | Sat, Jul 11, 2020, 09:19 PM

పీఎం కేర్స్ ఫండ్ విషయమై మోదీపై రాహుల్ ఘాటు వాఖ్యలు

పీఎం కేర్స్ ఫండ్ వివరాలను చెప్పడానికి కేంద్రం నిరాకరిస్తోన్న వేళ.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చైనా సంస్థలు పీఎం కేర్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చాయనే విషయం దేశంలోని అందరికీ తెలుసన్నారు. పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళం ఇచ్చిన వారి పేర్లను బయటపెట్టడానికి ఎందుకు అంతగా భయపడుతున్నారని ప్రధాని మోదీని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

‘విరాళాలు ఇచ్చిన వారి పేర్లను బయటపెట్టడానికి ప్రధాని ఎందుకు అంతగా భయపడుతున్నారు. చైనీస్ సంస్థలు హువావే, షియోమీ, టిక్‌టాక్, వన్‌ప్లస్ పీఎం కేర్ ఫండ్‌కు విరాళాలు ఇచ్చాయి. ఈ వివరాలను మోదీ ఎందుకు బయటపెట్టడం లేదు..?’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

పీఎం కేర్స్ ఫండ్ విషయంలో పారదర్శకత లోపించిందని.. దేశ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారంటూ రాహుల్ గాంధీ పదే పదే కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళాలు ఇచ్చిన వెంటిలేటర్ల తయారీ సంస్థ నాణ్యతలేని వెంటిలేటర్లను తయారు చేసిందని రాహుల్ గాంధీ ఇంతకు ముందు ఆరోపించారు. ప్రజాధనంతో అప్రమాణికమైన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని కాంగ్రెస్ నేత ఆరోపించారు.





Untitled Document
Advertisements