మాస్ మహారాజ సరసన ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్స్

     Written by : smtv Desk | Sat, Oct 17, 2020, 12:57 PM

మాస్ మహారాజ సరసన ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్స్

మాస్ మహారాజ్ రవితేజ రమేశ్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉండటంతో... డింపుల్ హయాతి, మీనాక్షి చౌధురిని తీసుకున్నారు. తెలుగమ్మాయి అయిన డింపుల్ హయాతి ‘గద్దలకొండ గణేష్‌’లో ‘జర్ర జర్ర...’ పాటతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు రెండు మూడు చిన్న చిత్రాల్లో కథానాయికగా నటించినా సరైన గుర్తింపు రాలేదు. ప్రభుదేవా, తమన్నా కాంబినేషన్లో వచ్చిన ‘అభినేత్రి-2’లోనూ కనిపించింది. ఇప్పుడు ఏకంగా రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టేయడంతో డింపుల్ దశ తిరిగినట్లేనని చెప్పొచ్చు. మరో హీరోయిన్‌గా ఎంపికైన మీనాక్షి చౌధురి ప్రస్తుతం సుశాంత్‌‌తో ‘ఇచట వాహనములు నిలుపరాదు’లో సినిమాలో నటిస్తున్నారు. అంతకు ముందు నిధి అగర్వాల్‌, అనూ ఇమ్మాన్యుయేల్‌ పేర్లను పరిశీలించినా చివరికి డింపుల్, మీనాక్షికి లక్కీఛాన్స్ దక్కింది. ‘రాక్షసుడు’ బ్లాక్‌‌బస్టర్ తర్వాత రమేశ్‌ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్‌ 2న ప్రారంభం కానున్నట్లు సమాచారం.

Untitled Document
Advertisements