క్రెడిట్ కార్డు తీసుకువస్తున్న పేటీఎం, యాప్ ద్వారా అప్లై

     Written by : smtv Desk | Tue, Oct 20, 2020, 05:46 PM

క్రెడిట్ కార్డు తీసుకువస్తున్న పేటీఎం, యాప్ ద్వారా అప్లై

డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటీఎం తన కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త అందించింది. సరికొత్త క్రెడిట్ కార్డును తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు 20 లక్షల క్రెడిట్ కార్డులను అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. వచ్చే 12-18 నెలల కాలంలో ఈ టార్గెట్ చేరుకోవాలని భావిస్తోంది. పేటీఎం తన యాప్ ద్వారా కస్టమర్లకు సరికొత్త డిజిటల్ అనుభూతిని కలిగించాలని యోచిస్తోంది. యూజర్లు వారి కార్డుపై పూర్తి కంట్రోల్ కలిగి ఉండొచ్చు. కొత్త క్రెడిట్ కార్డు కోసం పేటీఎం కార్డు జారీ సంస్థలతో జతకట్టనుంది. ఆ కంపెనీలో భాగస్వామ్యం ద్వారా కొత్త పేటీఎం క్రెడిట్ కార్డులను తీసుకురాబోతోంది. పేటీఎం క్రెడిట్ కార్డులో ఇన్‌స్టంట్ వన్ టచ్ ఫీచర్స్ ఉంటాయి. దవీటి సాయంతో సెక్యూరిటీ పిన్ నెంబర్, అప్‌డేట్ అడ్రస్, బ్లాక్ కార్డు, ఇష్యూ డూప్లికేట్ కార్డు, కార్డు బిల్లు మొత్తం వంటి సర్వీసులు అన్నింటినీ పొందొచ్చు. ఇంకా కార్డును ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. కార్డుపై అంతర్జాతీయ లావాదేవీలను స్టాప్ చేసుకోవచ్చు.

ఇంకా పేటీఎం క్రెడిట్ కార్డుపై ఇన్సూరెన్స్ సేవలు కూడా పొందొచ్చు. పేటీఎం యాప్ ద్వారానే ఈ సర్వీసులు అన్నీ కూడా పొందొచ్చు. పేటీఎం క్రెడిట్ కార్డుకు అప్లై చేసుకోవడం దగ్గరి నుంచి కార్డు జారీ వరకు అన్ని సర్వీసులు యాప్ ద్వారానే నిర్వహించుకోవచ్చు. ఇంకా క్యాష్‌బ్యాక్స్, రివార్డు పాయింట్లు, డిస్కౌంట్లు వంటివి కూడా పొందొచ్చు. రివార్డు పాయింట్లకు ఎక్స్‌పైరీ ఉండదు. పేటీఎం యాప్‌లో ఈ రివార్డు పాయింట్లో షాపింగ్ చేయొచ్చు.





Untitled Document
Advertisements