గూగుల్ పే షాక్...డబ్బులు పంపాలంటే చార్జీలు కట్టాల్సిందే

     Written by : smtv Desk | Wed, Nov 25, 2020, 11:44 AM

గూగుల్ పే షాక్...డబ్బులు పంపాలంటే చార్జీలు కట్టాల్సిందే

ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ గూగుల్ పే యూజర్లు ఝలక్. గూగుల్ పే ద్వారా డబ్బులు పంపిస్తే.. ఇకపై చార్జీల బాదుడు ఉంటుంది. అంటే గూగుల్ పే ద్వారా ఉచితంగానే ఎలాంటి చార్జీలు లేకుండా ఇతరులకు డబ్బులు పంపడం ఇక సాధ్యం కాదు. ఇకపై చార్జీలు కట్టాలి.

గూగుల్ పే రానున్న రోజుల్లో పీర్ టు పీర్ పేమెంట్ ఫెసిలిటీని నిలిపివేయాలని ఆలోచిస్తోంది. 2021 జనవరి నుంచి ఈ కొత్త నిర్ణయం అమలులోకి వచ్చే అవకాశముంది. అలాగే గూగుల్ పే ఇన్‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్ పేమెంట్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దీని తర్వాత గూగుల్ పే యూజర్లు మనీ ట్రాన్స్‌ఫర్ కోసం చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఇప్పటి వరకు అయితే గూగుల్ పే ఎంత మొత్తంలో చార్జీలు విధించబోయేది వెల్లడించలేదు. ప్రస్తుతం గూగుల్ పే మొబైల్ యాప్, పే.గూగుల్.కామ్ అనే వెబ్‌సైట్ ద్వారా డబ్బులు పంపడం, స్వీకరించడం వంటి సేవలను కస్టమర్లకు అందిస్తోంది. అయితే గూగుల్ కొత్త నిర్ణయం మాత్రం కేవలం వెబ్‌ యాప్‌కు మాత్రమే వర్తిస్తుంది.
ఇకపోతే గూగుల్ డెబిట్ కార్డు మనీ ట్రాన్స్‌ఫర్‌పై 1.5 శాతం ఫీజు వసూలు చేస్తామని పేర్కొంది. అంటే గూగుల్ ద్వారా ఇన్‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్ ఫెసిలిటీ పొందాలని భావించినా కూడా ఇదే స్థాయిలో చార్జీలు పడే అవకాశముంటుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే గూగుల్ తన యూజర్లకు కొత్త ఏడాదిోల పలు రకాల కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకురానుంది.





Untitled Document
Advertisements