ఉద్యోగులకు పెన్షనర్లకు తీపికబురు

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 02:51 PM

ఉద్యోగులకు పెన్షనర్లకు తీపికబురు

కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టేశాం. 2021 వచ్చేసింది. కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు అందించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు పెన్షనర్లకు కూడా తీపికబురు అందే అవకాశముంది.

మోదీ సర్కార్ ఈ కొత్త ఏడాదిలో జనవరి నెలలోనే ఉద్యోగులకు, పెన్షనర్లకు పెరిగిన డియర్‌నెస్ అలవెన్స్ DA అందించే అవకాశముందని నివేదికలు వెలువడుతున్నాయి. ఇదే జరిగితే చాలా మందికి బెనిఫిట్ కలుగనుంది. జనవరి నెలలో డీఏ 4 శాతం పెరగొచ్చని తెలుస్తోంది.

ఏడవ వేతన కమిషన్ సిఫార్సుల మేరకు ఈ పెరిగిన డీఏ ఉంటుందని నివేదికలు పేర్కొన్నాయి. కాగా కేంద్ర ప్రభుత్వం 2020 మార్చి నెలలో డీఏ పెంపు నిర్ణయం తీసుకుంది. 2020 జనవరి నుంచే పెంపు వర్తిస్తుందని వెల్లడించింది. డీఏను 4 శాతం పెంచారు. దీంతో డీఏ 21 శాతానికి చేరింది.

అయితే కరోనా వైరస్ కారణంగా డీఏ పెంపు అమలులోకి రాలేదు. మోదీ సర్కార్ డీఏ పెంపు బెనిఫిట్‌ను అమలులోకి తీసుకువస్తే దాదాపు 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 65 లక్షల పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది. ఇకపోతే మోదీ సర్కార్ గత వారంలో డిస్‌ఎబిలిటీ కంపెన్‌సేషన్ బెనిఫిట్‌ను ఎన్‌పీఎస్ లబ్ధిదారులకు కూడా విస్తరించిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements