నిమ్స్‌లో క్యాన్సర్ పేషెంట్లకు రూ.18 కోట్లతో అత్యాధునిక వైద్యం

     Written by : smtv Desk | Sat, Jan 09, 2021, 01:01 PM

నిమ్స్‌లో క్యాన్సర్ పేషెంట్లకు రూ.18 కోట్లతో అత్యాధునిక వైద్యం

నిమ్స్ హాస్పిటల్‌లో ఆధునికీకరించిన ఆంకాలజీ విభాగాన్ని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమంలో మేఘా సంస్థల అధిపతులు పీపీ రెడ్డి, పీవీ రెడ్డి, సుధా రెడ్డి పాల్గొన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద రూ.18 కోట్లతో మెయిల్ సంస్థ నిమ్స్‌లో క్యాన్సర్ పేషెంట్ల కోసం ఆంకాలజీ విభాగాన్ని అభివృద్ధి చేసింది.
2018 సెప్టెంబర్లో నిమ్స్‌లో ఆంకాలజీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగం కోసం ప్రత్యేక భవనం, యంత్రాలు, 50 పడకలు, సెంట్రల్ ఏసీ, లిఫ్ట్ తదితర సౌకర్యాలను మెయిల్ కల్పించింది. చిన్నపిల్లలు, మహిళలు, పురుషుల కోసం ప్రత్యేకంగా వార్డులను నిర్మించారు. పేషెంట్లకు అనుక్షణం సేవలు అందించడం కోసం వార్డుల్లోనే నర్సింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
గతంలో నిర్మించిన భవనంలో రెండో అంతస్థు నిర్వహణ బాధ్యతలను ఈ సంస్థే పర్యవేక్షిస్తోంది. అత్యాధునిక వసతులు, టెక్నాలజీతో ఆంకాలజీ వార్డు అందుబాటులోకి రావడంతో ఇకపై క్యాన్సర్ రోగులు నిమ్స్‌లో ఆధునిక వైద్యం పొందొచ్చు.





Untitled Document
Advertisements