రూ.3 లక్షలతో అంగంలోకి పూసలు చొప్పించుకున్నాడు!

     Written by : smtv Desk | Mon, Mar 08, 2021, 08:19 PM

రూ.3 లక్షలతో అంగంలోకి  పూసలు చొప్పించుకున్నాడు!

అదేంటో.. దేవుడు అన్ని అవయవాలు సక్రమంగా ఇచ్చినా కొందరికి నచ్చదు. టాటూల కల్చర్ పెరిగిన తర్వాత వెర్రి వెయ్యింతలైంది. కొందరు ఒళ్లంతా టాటూలు పొడిపించుకుని భయానకంగా మారిపోతున్నారు. మరికొందరు ఏలియన్స్‌లా మారేందుకు శరీరంలో రకరకాల మార్పులు చేసుకుంటున్నారు. ఒకరు నాలుకను నిలువుగా కట్ చేయించుకుంటుంటే.. మరికొందరు ముక్కు, చెవులు కోయించుకుంటున్నారు. కళ్లల్లో సైతం పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారు. అయితే మెక్సికోకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా తన అంగంలోకే పూసలు చొప్పించుకున్నాడు. మారిసియో డేనియల్ గార్సియా అనే వ్యక్తికి 18 ఏళ్ల వయస్సు నుంచే టాటూలకు అలవాటుపడ్డాడు. అప్పటి నుంచి 150 పైగా టాటూలు పొడిపించుకున్నాడు. చివరికి కళ్లల్లో కూడా టాటూ వేయించుకున్నాడు. అంతేగాక.. అతడి నాలుకను రెండుగా చీల్చుకున్నాడు. 19 చోట్ల కుట్లు వేయించుకున్నాడు. చెవులు కత్తిరించుకున్నాడు. ఇప్పటికే 4 వేల పౌండ్లు (భారత ప్రస్తుత కరెన్సీ ప్రకారం రూ.4 లక్షలు) వెచ్చించాడు. తాజాగా అతడు శరీరంలో మరికొన్ని మార్పులు చేయించుకుంటున్నాడు. అదనంగా మరో రూ.3 లక్షలు వెచ్చించి.. ఎంతో నొప్పి కలిగించే జెనైటల్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా అంగంలోకి పూసలు చొప్పించుకున్నాడు. సిలికాన్‌తో తయారు చేసిన 0.8 సెంటీ మీటర్ల పూసలను చొప్పించుకున్నాడు. తన పార్టనర్‌ను మరింత సంతోషపెట్టేందుకే ఈ సర్జరీ చేయించుకున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం తన శరీరంలో 75 శాతం టాటూలతో నిండి ఉందని, తనని ఎవరైనా దెయ్యమని హేళన చేసినా పట్టించుకోనని గార్సియా పేర్కొన్నాడు. మరి, అంగంలో పూసలు చొప్పించుకోవడం వల్ల లైంగిక సమస్యలు ఎదురుకావడం లేదా అనే ప్రశ్నకు మాత్రం బదులివ్వలేదు.






Untitled Document
Advertisements