"అశ్విన్‌తో ఫుల్ కోటా ఓవర్లు వేయించకపోవడం తప్పే" పాంటింగ్

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 03:23 PM


ఐపీఎల్ 2021లో రాజస్థాన్ రాయల్స్‌ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోవడానికి కారణం అశ్విన్‌తో ఫుల్ కోటా ఓవర్లు వేయించకపోవడమేనా..? ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో రాజస్థాన్ విజయాన్ని అందుకుంది. మిడిల్ ఓవర్లలో డేవిడ్ మిల్లర్ (62: 43 బంతుల్లో 7x4, 2x6).. చివర్లో క్రిస్ మోరీస్ (36 నాటౌట్: 18 బంతుల్లో 4x6) దూకుడుగా ఆడేశారు. ఒకవేళ అశ్విన్‌తో మరొక ఓవర్ బౌలింగ్ చేయించి ఉంటే ఫలితం ఉండేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ చీఫ్ కోచ్ పాంటింగ్ కూడా అశ్విన్‌తో ఫుల్ కోటా ఓవర్లు వేయించకపోవడం తప్పిదమేనని అంగీకరించాడు.

మ్యాచ్‌లో 3 ఓవర్లు వేసిన అశ్విన్ 4.70 ఎకానమీతో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ మూడు ఓవర్లలో కనీసం ఒక్క బౌండరీ కూడా అశ్విన్ ఇవ్వలేదు. అయినప్పటికీ చివర్లో అతడ్ని పక్కనపెట్టి టామ్ కరన్‌తో బౌలింగ్ చేయించిన ఢిల్లీ క్యాపిటల్స్ మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్ గమనానికి అనుగుణంగా బంతులు వేయడంలో సిద్ధహస్తుడైన అశ్విన్.. భాగస్వామ్యాలను బ్రేక్ చేయగలడు.

అశ్విన్‌ని పక్కన పెట్టడంపై రిక్కీ పాంటింగ్ స్పందించాడు. ‘‘మ్యాచ్‌లో అశ్విన్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. మూడు ఓవర్లు వేసి కేవలం 14 పరుగులే ఇచ్చాడు. ఫస్ట్ మ్యాచ్‌లో నిరాశపరిచిన అశ్విన్.. ఆ తర్వాత నెట్స్‌లో శ్రమించి తన తప్పిదాల్ని దిద్దుకున్నాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో అతనితో మరో ఓవర్ వేయించకపోవడం తప్పిదమే’’ అని రిక్కీ పాంటింగ్ అంగీకరించాడు.





Untitled Document
Advertisements