నెలకు రూ.210 కడితే...ప్రతి నెలా రూ.5 వేలు

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 11:33 AM

నెలకు రూ.210 కడితే...ప్రతి నెలా రూ.5 వేలు

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో రిటైర్మెంట్ పథకాలు కూడా ఉన్నాయి. అటల్ పెన్షన్ యోజన అనేది కూడా వీటిల్లో ఒకటని చెప్పుకోవచ్చు. అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరితే ప్రతి నెలా డబ్బులు వస్తాయి. రూ.5 వేల వరకు పొందొచ్చు.

60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా డబ్బులు పొందాలని భావించే వారికి అటల్ పెన్షన్ యోజన స్కీమ్ అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మీరు 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.5 వేలు పొందాలని భావిస్తే.. ఇప్పటి నుంచి నెలకు రూ.210 కడుతూ వెలితే సరిపోతుంది.

అందుకే చాలా మంది ఈ పథకంలో చేరుతున్నారు. మీరు కూడా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన వారు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్ ఉంటే ఈ పథకంలో సులభంగా చేరొచ్చు. మీరు రూ.1000 నుంచి రూ.5 వేల వరకు ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు.

వయసు ప్రాతిపదికన మీరు చెల్లించే మొత్తం మారుతుంది. అలాగే పెన్షన్ ఆప్షన్ మారినా కూడా మీరు చెల్లించే మొత్తంలో మార్పు ఉంటుంది. 18 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి రూ.5 వేలు పెన్షన్ పొందాలని భావిస్తే మీరు నెలకు రూ.210 కట్టాలి. అదే 30 ఏళ్ల వయసులో ఉన్న వారు రూ.5 వేలు పొందాలని భావిస్తే నెలకు రూ.577 చెల్లించాలి. దగ్గరిలోని బ్యాంక్‌కు వెళ్లి ఈ స్కీమ్‌లో చేరొచ్చు.





Untitled Document
Advertisements