శిబిచక్రవర్తి దానగుణం!

     Written by : smtv Desk | Thu, Oct 07, 2021, 10:02 AM

శిబిచక్రవర్తి దానగుణం!

శిబి ఆదిపురుషుడైన విష్ణువు వంశంలో అత్రి, పురూరవసు, ఆయుసు, నహుష, యయాతి, ఉశీనరులు జన్మించారు. ఆ వంశ వృక్షం లో  ఉశీనరుని కుమారుడే శిబి. ఇతడు ఒక రాజర్షి, యయాతి కుమార్తె అయిన మాధవికి జన్మించాడు. శిబి చక్రవర్తి దాన ఘణత ముల్లోకాలలో వ్యాపించిన ది. అతడిని పరీక్షించ తలచిన అగ్ని, ఇంద్రుడు. పావురం, డేగగా మారి పావురాన్ని డేగ వెంటాడగా అది వచ్చి శిబి తొడపై కూర్చుంది. శిబి ఎవరని అడగగా నేను పావురం రూపంలో ఉన్న మునిన ఓ డేగ నన్ను తరుముకొస్తోంది. నన్ను రక్షించమని కోరింది. డేగ ఈ పావురం నా ఆహారమని దాన్ని వదలమని కోరగా అందుకు శిబి అంగీకరించకుండా ఆ పావురం బరువుకు సమానమైన మాంసం ఇస్తానని చెప్పగా డేగ అందుకు అంగీకరించి నీ కుడితొడ మాంసమే కావాలని కోరింది. అప్పుడు శిబి తన తొడ నుండి శరీర ఖండలు కోసి తూచగ అది ఎంతకీ సరితూగక చివరికి తానే త్రాసులో కూర్చోగా వారు నిజస్వరూపులై నీవంటి దయామయుడు లేడు. నిన్ను పరీక్షించడానికి ఈ రూపం దాల్చామని శిబిని ఆశీర్వదించారు.





Untitled Document
Advertisements