టీటీడీ ఉద్యోగుల హెల్త్ ఫండ్ కు ఆమోదం

     Written by : smtv Desk | Thu, Oct 07, 2021, 06:18 PM

టీటీడీ ఉద్యోగుల హెల్త్ ఫండ్ కు ఆమోదం

ఈరోజు జరిగిన పాలకమండలి సమావేశంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అలిపిరి నడకమార్గం సుందరీకరణకు రూ. 7.5 కోట్లు మంజూరు చేశారు. కడప జిల్లా రాయచోటిలో కల్యాణమండపం నిర్మాణానికి రూ. 2.21 కోట్లు మంజూరు చేయడానికి ఆమోదం తెలిపారు. జమ్మూలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ. 17.40 కోట్లు మంజూరు చేయడానికి ఆమోదం తెలిపారు. టీటీడీ ఉద్యోగుల హెల్త్ ఫండ్ కు పాలకమండలి ఆమోదం తెలిపింది. టీటీడీ కాంట్రాక్ట్, ఓట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగ భద్రతకు ఆప్ కాస్ తరహాలో కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదించారు. స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వివిధ నిర్మాణాలకు రూ. 4.46 కోట్ల నిధులు కేటాయించారు. వరాహస్వామి విశ్రాంత భవనం-2లో మరమ్మతులకు రూ. 2.61 కోట్లు మంజూరు చేశారు.

Untitled Document
Advertisements