బ్యాంక్ కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్...కొత్త ఏడాది నుంచి చార్జీల బాదుడు షురూ

     Written by : smtv Desk | Tue, Dec 07, 2021, 06:35 PM

బ్యాంక్ కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్...కొత్త ఏడాది నుంచి చార్జీల బాదుడు షురూ

మీకు బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? బ్యాంక్ ఏటీఎంకు వెళ్లి డబ్బులు విత్‌డ్రా చేసుకుంటూ ఉంటారా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. బ్యాంకులు కొత్త ఏడాది నుంచి ఏటీఎం చార్జీలను సవరిస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే పలు బ్యాంకులు ఈ విషయాన్ని వెల్లడించారు.

దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI గతంలోనే ఏటీఎం చార్జీల పెంపునకు అంగీకారం తెలిపింది. దీంతో బ్యాంకులు జనవరి 1 నుంచి చార్జీలను సవరించేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటివి చార్జీల పెంపును తెలియజేశాయి.

అయితే ఇక్కడ ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాతనే చార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. దాదాపు ప్రతి బ్యాంక్ తన కస్టమర్లు నెలకు ఐదు సార్లు చార్జీలు లేకుండా ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఈ ఉచిత లావాదేవీల లిమిట్ దాటితేనే చార్జీలు పడతాయి.

బ్యాంక్ కస్టమర్లు తమ బ్యాంక్ ఏటీఎం ద్వారా లిమిట్ దాటిన తర్వాత డబ్బులు విత్‌డ్రా చేసుకుంటే రూ.21 చార్జీ చెల్లించుకోవాలి. నాన్ ఫైనాన్సియల్ ట్రాన్సాక్షన్లు ఉచితం. బ్యాంక్ కస్టమర్లు ఇతర బ్యాంకుల ఏటీఎం నుంచి కూడా మెట్రోల్లో అయితే 3 సార్లు, ఇతర పట్టణాల్లో అయితే ఐదు సార్లు చార్జీలు (ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు రెండూ కలిపి) లేకుండా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.


ఈ లిమిట్ దాటితే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు రూ.21 చార్జీ పడుతుంది. అలాగే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు రూ.8.5 చార్జీ చెల్లించుకోవాలి. ఇకపోతే ఈ చార్జీలకు ఇతర ట్యాక్స్‌లు అదనం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటివి అన్నీ కూడా దాదాపు ఒకే రకమైన చార్జీలు వసూలు చేయనున్నాయి.





Untitled Document
Advertisements