కళ్ళ కింద నల్లటి వలయాలు పోవాలంటే!

     Written by : smtv Desk | Sun, Jan 02, 2022, 04:08 PM

 కళ్ళ కింద నల్లటి వలయాలు పోవాలంటే!

కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడడానికి ప్రధాన కారణాలు నిద్రలేమి, ఎక్కువగా టీవీ, ఫోన్ లేదా కంప్యుటర్ చూడడం, పోషకాహార లోపం ఇవే. ఫోన్, టీవీ, కంప్యుటర్ వంటివి ఎక్కువసేపు చూడడం తగ్గించాలి. చూసే సమయంలో కూడా కళ్ళకి హానీ కలగకుండా నిర్దిష్ట దూరంలో కూర్చుని టీవీ చూడడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఫోన్ లేదా కంప్యుటర్ ముందు కూర్చున్నప్పుడు కళ్ళకి రక్షణ కల్పించే కళ్ళజోడు వాడడం అలవాటు చేసుకోవాలి. ఇక ఆహరం విషయానికి వస్తే ఐరన్,విటమిన్లు,ప్రోటీన్లు పుష్కలంగా లభించే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. శరీరంలో వీటి కొరత ఉన్నట్లయితే కళ్ళకింద వలయాలు రూపంలో అవి ప్రస్పుటం అవుతుంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రశాంతంగా,చాలినంత నిద్ర ఉండాలి.
కళ్ళ కింద నలుపు పోగొట్టడానికి కొన్ని చిట్కాలు మీకోసం..
* నీటిని మరిగించి అందులో గుప్పెడు తులసి క్యాబేజి ఆకులు వేసి మూత పెట్టి 20 నిమిషాల సేపు అలాగే ఉంచాలి. చల్లారిన తర్వాత వడపోసి ఆ నీటిలో కాటన్ బాల్ ముంచి కళ్ళ చుట్టూ అప్లై చేయాలి. ఈ మిశ్రమం యాకనే, పింపుల్స్ కు బాగా పనిచేస్తుంది.
* ఒక కప్పు లో నీరు పోసి అందులో వాడేసిన టీ బ్యాగులు ఫ్రిజ్లో పెట్టుకుని రాత్రి పడుకునే ముందు బయటకు వెళ్లి వచ్చిన తర్వాత కానీ పదిహేను నిమిషాలు సేపు కళ్ళ మీద టీ బ్యాగులను పెట్టుకుంటే వలయాలు పోతాయి.
* కీరదోస, బంగాళాదుంప రసంలో ముంచిన దూదిని కంటిపై పెట్టుకుని 20 నిమిషాల తర్వాత తీసేయండి.తర్వాత కొద్దిగా బేబీ ఆయిల్ రాసుకోండి. ఇలా రోజూ చేస్తే కంటి కింద నల్లని వలయాలు సమస్య దూరమవుతుంది.
* తాజాగా తీసిన పుదీనా రసంలో లేదా చల్లని పాలలో దూదిని ముంచి కళ్ళ చుట్టూ నెమ్మదిగా అద్దుకోవాలి. ఈ విధంగా కొన్నాళ్ళ పాటు క్రమం తప్పకుండా చేస్తుంటే ఫలితం తప్పక కనిపిస్తుంది. బాదాం నూనె లేదా కీర రసంలో నిమ్మరసం కలిపి నల్లని వలయాలు పై రాస్తున్న చక్కటి ఫలితం ఉంటుంది.
* విశ్రాంతిగా పడుకుని బంగాళదుంప లేదా కీరా చక్రాల మాదిరిగా కోసి వాటిని కళ్లపై పదిహేను నిమిషాల పాటు ఉంచుకుంటే అలసట తగ్గుతుంది. కళ్ళ చుట్టూ ఉండే నలుపు కూడా విరుగుతుంది.





Untitled Document
Advertisements