హైదరాబాద్ లో మళ్ళీ డ్రగ్స్ కలకలం ఈసారి బ్రూ ప్యాకెట్లలో ఉంచి సరఫరా..

     Written by : smtv Desk | Thu, May 26, 2022, 01:58 PM

హైదరాబాద్ లో మళ్ళీ డ్రగ్స్ కలకలం ఈసారి బ్రూ ప్యాకెట్లలో ఉంచి సరఫరా..

హైదరాబాద్లో మళ్లీ డ్రగ్స్ కలకలం. మంచి పని చేయాలంటే ఏదైనా ఒకటే మార్గం ఉంటుంది కానీ ఏదైనా చెడ్డ పని చేయాలంటే దానికి అనేక మార్గాలు ఉంటాయి అని మళ్ళీ ఓసారి అయింది. అయితే ఈసారి ఏకంగా డ్రగ్స్ బ్రూ కాఫీ పౌడర్ లో నింపి సరఫరా చేస్తూ కొందరు నిందితులు దొరికిపోయారు. ఇటీవలే హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పబ్బుల్లో మాదకద్రవ్యాల తీసుకున్నారంటూ పలువురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన నుండి హైదరాబాద్ కోలుకోకముందే మరో సారి బ్రూ కాఫీ పౌడర్ ప్యాకెట్లలో ఒక గ్రాముల నుంచి 2 గ్రాముల వరకు ఘర్షణ నుంచి సరఫరా చేస్తూ ఇద్దరు హైదరాబాదీలు మరియు ఒక ఆఫ్రికన్ వ్యక్తి పోలీసులకు దొరికిపోయాడు. అయితే ఈ ఆఫ్రికన్ వ్యక్తి హైదరాబాదులోని సన్ సిటీ మరియు వనస్థలిపురం మొదలైన ప్రదేశాలకు సరఫరా చేస్తూ పట్టుబడ్డాడు. అయితే ఇతడికి డ్రగ్స్ ఢిల్లీ నుంచి వస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే ఈ ఈ వ్యక్తి కొకైన్ డ్రగ్ ను బ్రూ ప్యాకెట్ లో ఉంచి పాత వ్యక్తి అయితే ఒక ప్యాకెట్ ను ఐదు వేల కి కొత్త వ్యక్తులకు ఆరు వేల చొప్పున అమ్ముతున్నట్లు తెలియజేసినట్లు సమాచారం.





Untitled Document
Advertisements