ఫ్యాను గాలికి చంద్రబాబు మరియు ఆయన కొడుకుకి మతిపోయింది.. ఆర్.కె.రోజా

     Written by : smtv Desk | Sat, May 28, 2022, 01:47 PM

ఫ్యాను గాలికి చంద్రబాబు మరియు ఆయన కొడుకుకి మతిపోయింది.. ఆర్.కె.రోజా

ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నందమూరి తారకరామారావు గారి ప్రాణాలు పోవడానికి కారణమైన చంద్రబాబు నాయుడు మహానాడు కార్యక్రమంలో భాగంగా ఆయనకు పూలమాలవేసి నివాళులు అర్పించడాన్ని రోజా తప్పుబట్టారు. ఇకనైనా చంద్రబాబు తాను చేసిన మోసాన్ని ఒప్పుకొని మహానాడు కార్యక్రమంలో ఎన్టీఆర్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ కూడా ఒక క్షణం లో తెలుగుదేశం పార్టీకి పట్టిన చీడ చంద్రబాబు అని పేర్కొన్నారు అని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ మీద గౌరవంతో తమ ప్రభుత్వం ఒక జిల్లాకు ఆయన పేరును కూడా పెట్టడం జరిగిందని వెల్లడించారు. అయితే వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా 95 శాతం మంది జనసేన తెలుగుదేశం మంది కార్యకర్తలకు ఫలాలు అందుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు మరియు ఆయన తనయుడు లోకేష్ ను గురించి చెబుతూ ఫ్యాన్ గాలికి వీరిద్దరికీ మతి పోయింది అని రోజా వ్యాఖ్యానించారు. అయితే కోనసీమలో మాత్రం అంబేద్కర్ పేరు పెట్టడం ద్వారా ఆ అల్లర్లు జరుగుతున్నాయని వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని రోజా వెల్లడించారు.

Untitled Document
Advertisements