ఆ పుస్తకం సత్యదూరం: ట్రంప్‌

     Written by : smtv Desk | Sat, Jan 06, 2018, 03:10 PM

ఆ పుస్తకం సత్యదూరం: ట్రంప్‌

వాషింగ్టన్‌, జనవరి 06: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనపై వెలువడిన 'ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ: ఇన్‌సైడ్‌ ద ట్రంప్‌ వైట్‌హౌస్‌' అనే పుస్తకాన్ని 'అసత్యాలమయం'గా అభివర్ణించారు. మరోవైపు దాని విడుదలను అడ్డుకోవడానికి ఆయన తరఫు న్యాయవాదులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ పుస్తకాన్ని మైఖేల్‌ వుల్ఫ్‌ అనే రచయిత రాశారు. ఆ పుస్తకం కోసం అతడితో తాను ఎన్నడూ మాట్లాడలేదని అందులోని అంశాలన్నీ అసత్యాలు వక్రీకరణలని ట్రంప్ తెలిపారు. నిజానికి ఈ పుస్తకాన్ని రెండు రోజుల తర్వాత విడుదల కావాల్సి ఉండగా దాన్ని అడ్డుకునేందుకు ట్రంప్‌ న్యాయవాదులు విఫలయత్నం చేశారు. 200కుపైగా ఇంటర్వ్యూలు, వైట్‌హౌస్‌లో తాను చేపట్టిన పర్యటనల ఆధారంగా ఈ పుస్తకాన్ని రాసినట్లు వుల్ఫ్‌ పేర్కొన్నారు.





Untitled Document
Advertisements