ఓఎల్ఈడీ డిస్ ప్లేతో శామ్ సంగ్ న్యూ మొబైల్..

     Written by : smtv Desk | Thu, Feb 01, 2018, 11:24 AM

ఓఎల్ఈడీ డిస్ ప్లేతో శామ్ సంగ్ న్యూ మొబైల్..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: మొబైల్ ఉత్పత్తి దిగ్గజ సంస్థ శామ్ సంగ్ ఓఎల్ఈడీ డిస్ ప్లేతో మడిచిపెట్టుకునేందుకు వీలుగా తయారు చేసే స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనుంది. ఈ ఏడాదిలోనే వీటిని అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనతో ఉంది. అలాగే, తన ఫ్లాగ్ షిప్ ఫోన్ అయిన గెలాక్సీ ఎస్9పై దృష్టి పెట్టనున్నట్టు పేర్కొంది. ఈ మేరకు 2018 సంవత్సరానికి సంబంధించిన రోడ్ మ్యాప్ ను సంస్థ నాలుగో క్వార్టర్ (డిసెంబర్) ఫలితాల విడుదల సందర్భంగా ఆవిష్కరించింది.

Untitled Document
Advertisements